సమంతకి నచ్చిన ఆ మూడు విషయాలూ...

Update: 2016-10-27 05:04 GMT
అందాల భామ సమంతతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనగానే సోషల్ మీడియా కాసేపు దద్దరిల్లిపోయింది. ఎన్నాళ్లగానో ఆమెను అడగాలనుకుంటున్న ప్రశ్నలన్నీ కుండపోతగా ఆమె ఇన్ బాక్స్ లో ప్రత్యక్షమయ్యాయి. వీటిలో తన మనసుకి నచ్చిన వాటికి ఓపిగ్గా సమాధానమిస్తూ వచ్చింది.

అయితే మొత్తం అన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్నకి సామ్ ఇచ్చిన సమాధానం అత్యంత పాపులర్ అయ్యింది. ఏ మూడు విషయాలు లేకుండా మీరు వుండలేరు అన్న ప్రశ్నకు సమంతా ఏ మాత్రం ఆలోచించకుండా "చై - మస్కతి ఐస్ క్రీమ్ మరియు పని" అని సమాధానమిచ్చింది.

నాగచైతన్యకి తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత నాగచైతన్యకి ఇచ్చినట్టు అర్ధమవుతుంది. సమంతా ఆన్సర్ తరువాత తాను చెప్పిన ఐస్ క్రీం ఏంటా అని చాలామంది సెర్చ్ చెయ్యడం గమనార్హం. ఇక పని లేకుండా సమంతాకి ఏమి తోచదని చాలాసార్లే చెప్పింది. సో ఎప్పటినుంచో తనలో దాగున్న విషయాన్ని ఈ విధంగా ఓపెన్ అయ్యిందన్నమాట

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News