బాలీవుడ్ స్టార్స్ తో కలిసి రౌండ్ టేమ్ ఇంటర్వ్యూలో సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. మరోసారి ఆ విషయం చర్చనీయాంశం అయ్యేలా సమంత బాలీవుడ్ స్టార్స్ తో కలిసి రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ప్రముఖ హోస్ట్ కమ్ ప్రజెంటర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన అనుపమ చోప్రా నిర్వహించిన విభిన్నమైన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో సమంత పాల్గొనడం సౌత్ లో చర్చనీయాంశం అయ్యింది. బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్న ఆ టీమ్ లో సమంత కూడా జాయిన్ అవ్వడం చూస్తుంటే ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె జర్నీ స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్.. సిద్దార్థ్ మల్హోత్ర.. సన్య మల్హోత్ర లతో పాటు తాప్సి మరియు సమంతలు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బాలీవుడ్ లో చర్చనీయాంశం అయిన ఈ ఇంటర్వ్యూ కు ముందు తాప్సి మరియు సమంతలు కలిసి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు.
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ఎలా సాగిందనే విషయాలను పక్కన పెడితే ఇంటర్వ్యూకు ముందు మరియు ఆ తర్వాత జరిగిన పరిణామల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తాప్సి మరియు సమంతలు కలిసి వెళ్లడం.. కలిసి రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది.
సమంత హీరోయిన్ గా తాప్సి నిర్మాణంలో ఒక సినిమా బాలీవుడ్ లో రూపొందబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నారంటూ ఇద్దరి కాంబో సినిమాపై మరింత స్పష్టత వచ్చినట్లు అయ్యిందని మీడియా వర్గాల వారు అంటున్నారు.
సినిమా మొదలు పెట్టేది ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సమంత బాలీవుడ్ లో ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ లను ఓకే చేసింది. సౌత్ నుండి మెల్ల మెల్లగా సమంత దూరం అవ్వాలని భావిస్తున్నట్లుగా ఆమె చర్యలను చూస్తుంటే అనిపిస్తుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సమంత బాలీవుడ్ ఎంట్రీ లో భాగంగా ఈ రౌండ్ టేబుల్ ఇంటర్య్వూ ఇచ్చి ఉంటుందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.