• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూజ హెగ్డే ప్లేస్ లో సమంత...

పూజ హెగ్డే ప్లేస్ లో సమంత .. కారణం అదే!

By - Tupaki Desk
Update: 2021-11-25 09:48 GMT
'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' విజయాలతో త్రివిక్రమ్ మాంఛి జోరుమీదున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా ఆయన పూజ హెగ్డేను తీసుకున్నాడు. ఆమెకు ఆయన మూడోసారి కూడా ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఈ బుట్టబొమ్మ ఖాతాలో ఇంకో హిట్ పడిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఆమె చేయడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అలా అని చెప్పేసి ఈ ప్రాజెక్టు నుంచి పూజ హెగ్డేను ఎవరూ తప్పించలేదు. ఆమెనే డేట్లు సర్దుబాటు చేయలేకపోతోందట. పూజ హెగ్డే నుంచి ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' హిట్ కొట్టగా, ప్రభాస్ సరసన నాయికగా ఆమె చేసిన 'రాధే శ్యామ్' జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చరణ్ జోడీగా ఆమె ప్రత్యేక పాత్రను పోషించిన 'ఆచార్య' ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లకు రానుంది. హిందీలో 'సర్కస్' .. తమిళంలో 'బీస్ట్' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందువలన త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో చేయాలని ఆమెకి ఉన్నప్పటికీ డేట్లు కుదరడం లేదట.

ఈ కారణంగానే ఈ సినిమాను చేయలేనని ఆమె త్రివిక్రమ్ కి చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. వచ్చేనెల నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దాంతో హీరోయిన్ విషయంలో ఆలస్యం చేయకుండా సమంతను సంప్రదించారట. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు? అందువల్లనే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. విడాకుల తరువాత సరైన ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న సమంతకు ఇది ఊరట కలిగించే అవకాశమే.

గతంలో సమంత ఇటు త్రివిక్రమ్ తోను .. అటు మహేశ్ తోను చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె చేసిన 'అత్తారింటికి దారేది' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అ ఆ' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. సమంత కెరియర్లో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలుగా నిలిచాయి. ఇక మహేశ్ బాబు జోడీగా ఆమె చేసిన 'దూకుడు' .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు కూడా ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో!
Tags:    
  • Samantha Item Song Update 
  • samantha songs 
  • samantha movies 
  • samantha pics 
  • pooja hegde movies 
  • pooja hegde images 
  • pooja hegde pics 
  • pooja hegde 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS