న‌వ‌త‌రం దర్శ‌కుడికి సామ్ గ్రీన్ సిగ్న‌ల్

Update: 2021-09-17 08:30 GMT
అందాల స‌మంత ఇటీవ‌లే శాకుంత‌లం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2తో ఆక‌ట్టుకున్న త‌ర్వాత నెట్ ఫ్లిక్స్ తో సామ్ భారీ వెబ్ సిరీస్ కి సంత‌కం చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ ల‌తో కంటిన్యూ అయ్యే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇంత‌లోనే స‌మంత టాలీవుడ్ లో మ‌రో చిత్రానికి సంత‌కం చేశార‌ని తెలిసింది. శ్రీదేవి మూవీస్ నిర్మించే సినిమా కోసం సమంత రూత్ ప్రభు సంతకం చేసార‌ట‌. బౌండ్డ్ స్క్రిప్ట్ తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌మంత‌ను ఒప్పించార‌ని తెలిసింది. ఈ చిత్రానికి ఒక కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. నవంబర్ నుండి ఈ చిత్రం కోసం సామ్ తన తేదీలను కేటాయించినట్లు గుస‌గుస వినిపిస్తోంది. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. నవంబర్ లో సినిమాను ప్రారంభిస్తారు.

ఇత‌ర‌త్రా వివ‌రాలు తెలియ‌క‌పోయినా.. సమ్మోహనం - జెంటిల్ మన్ లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన బ్యానర్ తో సామ్ బిగ్ డీల్ కుదిరిన‌ట్టేన‌ని క‌న్ఫామ్ అయింది. ఓ సోర్స్ నివేదన‌ ప్ర‌కారం.. శ్రీ‌దేవి మూవీస్ తో స‌మంత‌ సినిమా తాజాగా అధికారికంగా క‌న్ఫామ్ అయింది. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ సినిమా టైటిల్ స‌హా ఇత‌ర‌త్రా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.


Tags:    

Similar News