ఏ మాయ చేసావే.. ఎమోషనల్ అయిన సమంత

Update: 2019-02-26 12:21 GMT
స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు సౌత్ లో టాప్ లీగ్ లో సమంత కరెక్ట్ గా తొమ్మిదేళ్ళ క్రితం హీరోయిన్ గా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏ మాయ చేసావే' సినిమాతో సమంతా హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా 26 ఫిబ్రవరి, 2010  న విడుదలయి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.  

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏ మాయ చేసావే' ను మహేష్ బాబు సోదరి మంజుల నిర్మించారు.  ఈ సినిమా రిలీజ్ అయి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంజుల ఘట్టమనేని ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంటూ 'ఏ మాయ చేసావే' పోస్టర్ షేర్ చేసి "9 ఏళ్ళయింది కానీ ఇంకా నిన్నటిలాగే ఉంది..  ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఛీర్స్ #ఏ మాయ చేసావే @చైతన్య అక్కినేని @సమంతా @సుధీర్ బాబు @ఎఆర్ రెహమాన్ @గౌతమ్ మీనన్" అంటూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ కు సమంతా "నా జీవితాన్ని మలుపు తిప్పిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ" అంటూ రిప్లై ఇచ్చింది.   

మరోవైపు సమంతా ఫ్యాన్ క్లబ్  ట్విట్టర్ హ్యాండిల్ లో "#9YearsForCultClassicYMC. ఈ అందమైన బంధానికి 9 ఏళ్ళు.  పోటీని తట్టుకుని రెండేళ్ళు ఉండడమే కష్టమైన ఇండస్ట్రీలో తొమ్మిదేళ్ళ నుండి .. వెరైటీ రోల్స్ చేస్తూ టాప్ లో ఉన్నావు.  లాట్స్ అఫ్ లవ్ సమంతా. యు ఆర్ రాకింగ్" అంటూ ట్వీట్ చేశారు.  దీనికి సమంతా "మీరు లేకుండా నేను లేను.  మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు"  అంటూ ఒక ఎమోషనల్ రిప్లై ఇచ్చింది.  హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ సమంతాకు మాత్రం వారందరిలో స్పెషల్ ప్లేస్ ఉంటుంది.  అందులో ఏమీ అనుమానం లేదు.


Tags:    

Similar News