సమంత ముద్దు పెట్టిన ఈమెకు పాజిటివ్‌.. సామ్‌ గురించి ఫ్యాన్స్‌ ఆందోళన

Update: 2020-06-23 09:50 GMT
టాలీవుడ్‌ స్టార్స్‌ కు కూడా ఈమద్య మహమ్మారి వైరస్‌ భయం పట్టుకుంది. ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్‌ వైరస్‌ పాజిటివ్‌ గా నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఇక తాజాగా సమంతకు చాలా ఆప్తురాలిగా పేరున్న ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్ప రెడ్డికి వైరస్‌ పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యింది. ఇటీవలే ఆమె కాస్త అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు చేయించుకుంది. దాంతో ఆమెకు పాజిటివ్‌ గా తేలిందట. శిల్పకు పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో సమంత అభిమానులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్‌ కూడా ప్రస్తుతం ఈ విషయంలో టెన్షన్‌ పడుతున్నారు.

వారి టెన్షన్‌ కు కారణం ఉంది. ఏంటీ అంటే ఇటీవలే సమంత ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ చేసిన ఫొటోలో శిల్ప రెడ్డిని ఏకంగా ముద్దు పెడుతూ సమంత కనిపించింది. వీరిద్దరి స్నేహంకు ఆ ఫొటో గుర్తుగా చెప్పుకోవచ్చు. అంతటి క్లోజ్‌ గా ఉన్న వీరిద్దరు వైరస్‌ ను కూడా షేర్‌ చేసుకున్నారా అనే ఆందోళన ప్రస్తుతం వ్యక్తం అవుతోంది. శిల్ప రెడ్డికి వైరస్‌ ఎప్పటి నుండి ఉందో చెప్పలేని పరిస్థితి. ఇటీవలే ఆమెను సమంత కలిసింది. అంతే కాకుండా చాలా క్లోజ్‌ గా కూడా కాంటాక్ట్‌ అయ్యారు. కనుక అప్పటికే శిల్ప రెడ్డికి వైరస్‌ ఉండి ఉంటే ఖచ్చితంగా సమంతకు కూడా వచ్చి ఉంటుందని అంతా అంటున్నారు.

శిల్ప కాంటాక్ట్‌ జాబితాలో సమంత ఉంటుంది కనుక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమంత కూడా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి సమంత టెస్టుకు వెళ్తుందా చూడాలి. ప్రస్తుతానికి సమంత పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఫ్యాన్స్‌ మాత్రం ఆందోళన పడుతున్నారు.
Tags:    

Similar News