జిమ్ లో మ‌ళ్లీ సామ్ సీరియ‌స్ వ‌ర్క‌వుట్స్

Update: 2021-12-27 10:41 GMT
బాలీవుడ్ లో దీపిక ప‌దుకొనే.. అనుష్క శ‌ర్మ‌.. క‌రీనా క‌పూర్ లాంటి ఫిట్ నెస్ ఫ్రీక్స్ ని నిరంత‌రం అనుక‌రించేందుకు ఇష్ట‌ప‌డే స‌మంత త‌న స్నేహితురాలు కం ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డితో క‌లిసి జిమ్ చేసేందుకు ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటారు. ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల వ‌రుస విహార‌యాత్ర‌ల‌కు క‌లిసే వెళ్లారు. ఇప్పుడు నెమ్మ‌దిగా సామ్ వ్య‌క్తిగ‌త క‌ల‌త‌ల నుంచి తిరిగి కోలుకుంటున్నారు.

అదే క్ర‌మంలో జిమ్ యోగా సెష‌న్స్ ని అస్స‌లు మిస్ చేయ‌డం లేదు. తాజాగా స‌మంత జిమ్ లో కార్డియో ఎక్స‌ర్ సైజులు స‌హా మ్యాట్ పై క‌స‌ర‌త్తులు చేస్తూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. త‌న‌తో పాటే స్నేహితురాలు శిల్పారెడ్డి ఉన్నారు. ఆ ఇద్ద‌రూ క‌స‌ర‌త్తుల్లో పూర్తిగా లీన‌మైపోవ‌డం ఈ వీడియోలో క‌నిపిస్తోంది.

సామ్ ఎప్ప‌టిలాగే కోలుకుంటున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. శ్రీ‌దేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సినిమా స‌హా ఓబేబి నిర్మాలో హాలీవుడ్ సినిమా కూడా సామ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం యోగా క‌స‌ర‌త్తుల‌తో శ‌రీరాకృతిని ట్రిమ్ చేస్తున్నారు. ఊ అంటావా ఊఊ అంటావా లాంటి ఐట‌మ్ పాట‌తో ఒక ఊపు ఊపిన సంగ‌తి తెలిసిందే. మునుముందు గ్లామ‌ర్ ప‌రంగానూ సామ్ నుంచి అభిమానులు అన్ లిమిటెడ్ ట్రీట్ ని ఆశించ‌వ‌చ్చ‌ని ఫీల‌ర్స్ ఇచ్చిన‌ట్టైంది.




Tags:    

Similar News