సమంత.. టాలీవుడ్ కు కొత్త ఆప్షన్
తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క. అప్పట్లో వచ్చిన అరుంధతి మొదలుకొని ఈ ఏడాది వచ్చిన భాగమతి వరకు అనుష్క హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలన్నింటినీ అదరగొట్టేసింది. అసలు భాగమతి సినిమాలో ఉన్న ఒకే అట్రాక్షన్ అనుష్క. కేవలం ఆమెకున్న పాపులారిటీ వల్లే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్.. కలెక్షన్లు వచ్చాయి.
మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్టర్లకు అనుష్క కాకుండా ఇంకో స్టార్ హీరోయిన్ ఆ రేంజిలో ప్రామిసింగ్ కనిపిస్తోంది. ఆమే తెలుగింటి కోడలు సమంత. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఆ పాత్ర సమంత తప్ప ఇంకెవరూ అంత బాగా చేయలేరు అనిపించేలా నటించింది. అందుకే ఇప్పుడు ఆమెతో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీసే ఆలోచన చేస్తున్నాడు ఓ కొత్త డైరెక్టర్. మొదటి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ వంగా దగ్గర పనిచేసిన గిరీశయ్య ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
డైరెక్టర్ ఈమధ్య సమంతను కలిసి తన సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ వినిపించాడట. శామ్ కూడా దానికి బాగానే ఇంప్రెస్ అయిందని టాక్. ఈ సినిమాలో రోల్ తనకు ఇంకా మంచి పేరు తెచ్చిపెడుతుందని శామ్ నమ్మకంగా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమెను అంతగా ఇంప్రెస్ చేసిందంటే స్టోరీ కాస్త కొత్తగా ఉందనే అనుకోవచ్చు. సమంత ఇప్పటికే కన్నడ రీమేక్ యు టర్న్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది.