• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుర్ర హీరో సినిమాకు...

కుర్ర హీరో సినిమాకు బ్రేకేసిన సమంత

By - Tupaki Desk
Update: 2019-10-04 07:18 GMT
టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఒకే కథతో ఒకరికి తెలియకుండా ఒకరు సినిమా ప్లాన్ చేసుకొని తీరా తెలిసాక నాలుక కరుచుకుంటారు. లేటెస్ట్ గా సమంత 'ఓ బేబీ' సినిమాకు 'విఠలాచర్య' కథ పోలి ఉన్న కారణంగా ఆ సినిమాను ఆపేశారట. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఆ మధ్య 'విఠలాచార్య' అనే సినిమాను మొదలెట్టారు. గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా చేశారు. అయితే ఓ ఐదు రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యం అయింది. ఈ లోపు సమంత 'ఓ బేబీ' సినిమా వచ్చేసింది.

'ఓ బేబీ 'సినిమాలో బేబీ అనే వృద్ధురాలు యవ్వనం పొందుతుంది. సరిగ్గా 'విఠలాచార్య' కథ కూడా అంతే అట. అందుకే సమంత సినిమా చూసాక చేసేదేం లేక సినిమాను ఆపేసునుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని హీరో నవీన్ విజయ్ కృష్ణ స్వయంగా చెప్పాడు. అయితే ఆ సినిమాను ఎలాగైనా తీసే ఆలోచనలో ఉన్నామని కథలో ఏదైనా మార్పులు చేసి మళ్లీ షూట్ చేసే ప్లాన్ ఉందని చెప్పాడు.

ఇక ఈ హీరోకి ఇది కొత్తేమి కాదు. నవీన్ చేసిన మొదటి సినిమా 'ఐనా ఇష్టం నువ్వు' కూడా రిలీజ్ వరకూ వచ్చి అటకెక్కింది. నిజానికి ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ అనిపించుకుంటున్న కీర్తి సురేష్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అవ్వాలి. సినిమా ఆగిపోవడం అదే సమయంలో కీర్తికి 'నేను శైలజా' ఆఫర్ రావడం జరిగింది. ఇక చేసేదేం లేక ఆ సినిమాను వదిలేసి 'నందిని నర్సింగ్ హోమ్' తో హీరోగా పరిచయమయ్యాడు నవీన్. ఇప్పుడు రెండో సినిమాగా 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాను రిలీజ్ కి రెడీ చేసాడు. ఏదేమైనా చేసిన నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు ఆగిపోవడం ఈ కుర్ర కెరీర్ కి ఎఫెక్టే.



Tags:    
  • samantha 
  • Naveen Vijaya Krishna 
  • O Baby 
  • Vittala Charya 
  • Naresh 
  • Akkineni Samantha 
  • saantha Stopped Vittala Charya Movie 

Similar News

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

Copyright @2026

Powered by Blink CMS