లాక్ డౌన్ లో ఆన్లైన్ వర్కౌట్స్ చేస్తున్న సామ్...!

Update: 2020-05-13 11:50 GMT
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బంధీ అయింది. ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఖాళీ సమయం దొరకడంతో తమలో దాగి ఉన్న ఇతర టాలెంటులను బయటకి తీస్తున్నారు. ఇంట్లో వాళ్ళు చేసే వంటల వీడియోలను, వర్క్ ఔట్ వీడియోలను, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం జిమ్ కెళ్లే అవకాశం లేకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ బద్ధకస్తులుగా తయారవుతున్నారట. కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం లాక్ డౌన్ లో కూడా తన వర్క్ ఔట్స్ మాత్రం అశ్రద్ధ చేయడం లేదు. ఇప్పటి దాకా అందరూ ఆన్లైన్ లో క్లాసెస్ వింటున్నారు.. తమకు తెలియని భాషలను ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు.. కొందరు యాక్టింగ్ క్లాసెస్ కి కూడా అటెండ్ అవుతున్నారు. కానీ సమంత మాత్రం ఆన్లైన్ వర్కౌట్స్ క్లాసెస్ అటెండ్ అవుతోంది.

లాక్ డౌన్ లో ఫిట్ నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ తో వీడియో కాల్ ద్వారా ఫిట్ నెస్ మీద ఫోకస్ చేస్తోంది. వీడియో కాల్ ద్వారా వర్కౌట్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. లాక్ డౌన్ లో ఇంట్లో లేజీ గా తయారవుతున్న వారికి సమంత ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. పెళ్లి అయిన తర్వాత చాలా మంది శరీర ఆకృతిలో మార్పులు వస్తుంటాయి. కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం వర్కౌట్స్ చేస్తూ అలానే మైంటైన్ చేస్తూ వస్తోంది. నిజానికి సమంత మొదటి నుండి కూడా ఫిట్ నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. తాను ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి వర్క్ ఔట్స్ ఎంతో దోహదం చేస్తాయని గతంలో కూడా చాలా సార్లు చెప్పింది. పెద్ద పెద్ద బరువులను ఎత్తుతూ మగవాళ్లకు సైతం పోటీ ఇస్తోంది. ఇప్పుడు లాక్ డౌన్ లో కూడా తన జిమ్ ట్రైనర్ తో వీడియో కాల్ ద్వారా ఆర్మ్స్ కి సంబందించిన వ్యాయామం చేస్తూ ఫిట్ నెస్ ని కాపాడుకుంటోంది.

మరోపక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన విషయాలను తన భర్త నాగ చైతన్య ఫోటోలను షేర్ చేస్తూ క్వారంటైన్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే ఈ ఏడాది సమంత నటించిన 'జాను' ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘జాను’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఆశించినతగా రాలేదనే చెప్పాలి. అయితే నటిగా సమంతకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అయ్యే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ లో సమంత కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో సామ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.
Tags:    

Similar News