చీరలో.. పార్టీలో.. వాటే శామ్స్

Update: 2016-12-13 04:10 GMT
రెండు రోజుల క్రితం అఖిల్ ఎంగేజ్మెంట్ లో సమంత ఎలా కనిపించిందో చూశారుగా! అఖిల్-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధ వేడుకకు ఎంతో పద్ధతిగా ఒద్దికగా చీరకట్టులో హాజరైంది శామ్స్. అంతే కాదు.. అక్కినేని కుటుంబంతో కలిసి బోలెడన్ని సంప్రదాయాలు కూడా పాటించేసింది. నాగార్జున-నాగచైతన్య-అఖిల్-శ్రేయా భూపాల్ లతో కలిసి ఓ లవ్లీ ఫోటోకు కూడా పోజ్ ఇచ్చింది.

ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పార్టీ జరుగుతోంది. అఖిల్ వీక్ పేరుతో ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేస్తున్నారులే. అదంటే సంప్రదాయ వేడుక కాబట్టి చీరలో వచ్చింది కానీ.. పార్టీకి మాత్రం శామ్స్ మళ్లీ వెస్ట్రన్ వేర్ లో ప్రత్యక్షమైపోయింది. చాలా హాటుగా దర్శనమిచ్చింది. అంతే మరి అక్కడంటే వదిన గారి పాత్ర కాబట్టి బోలెడన్ని సంప్రదాయాలు తప్పవు. ఇక్కడ పార్టీ కల్చర్ లోకి వచ్చాక.. అంతా ఫ్యాషన్ కే ఇంపార్టెన్స్ కదా.

శామ్స్ చిత్రాలు ఇక్కడితో అయిపోలేదు. ఇంట్లో కూర్చుని ఎంత బుద్ధిగా క్రిస్మస్ ట్రీ తయారు చేస్తోందో చూశారా? పక్కనే కాఫీ(?)గ్లాస్ పెట్టుకుని మరీ.. నీట్ గా క్రిస్మస్ ట్రీ సిద్ధం చేస్తోంది. మరి ఆ రాబోయే శాంటా క్లాజ్ ఏమేం తీసుకు రావాలని కోరుకుంటుందో సమంత!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News