ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత యాక్షన్ పీక్స్
అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్` సీక్వెల్ పై అప్ డేట్ ఏదీ? ఇంతకీ సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పటినుంచి? అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సందర్భమిది.
ఈ సిరీస్ లో సమంత విలన్ గా నటిస్తోందన్న ఉత్కంఠ అభిమానుల్ని నిలువనీయడం లేదు. అయితే కరోనా క్రైసిస్ వల్ల ఇన్నాళ్లుగా దీనిపై సరైన అప్ డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ త్వరలో ప్రీమియర్ కు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఉగ్రవాది పాత్రలో సమంత అందరికీ షాకిస్తుందని మరోసారి క్లూ అందింది.
సమంత టాక్ షో సామ్ జామ్ తాజా ఎపిసోడ్లో.. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలలో ఒకరైన రాజ్ (రాజ్ -డికె ద్వయం) సామ్ నెగెటివ్ రోల్ చేయాల్సి ఉంటుందని.. ఈ సిరీస్ లో భారీ స్టంట్స్ తో యాక్షన్ చేయాల్సి ఉంటుందని వారు చెప్పినప్పుడు సమంతా చాలా ఉత్సాహంగా ఉందని తెలిపారు.
చిత్రీకరణ దశలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు సమంతా రియల్ లుక్ కోసం ఒక బ్యాడ్డీని కొట్టేసిందని కూడా ఫన్ మూవ్ మెంట్ ని రివీల్ చేశారు. అప్పట్లో నాగార్జున పెద్ద తెర యాక్షన్ లో చాలా రియాలిటీతో కనిపించేవారు. ఇప్పుడు సమంతా అలా చేస్తున్నారు! అని రాజ్ అన్నారు. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ ఆద్యంతం సమంత యాక్షన్ థ్రిల్స్ తో మతి చెడిపోవడం ఖాయమేనని అర్థమవుతోంది.