'పెద్ది' ఫినిషింగ్ టచ్.. గ్లామర్ అస్త్రం క్లిక్కయ్యేనా?

పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ రోజు నుంచే హైదరాబాద్ లో షూటింగ్ మొదలైనట్లు సమాచారం.;

Update: 2026-04-26 11:07 GMT

సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది అన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ రిలీజ్ డేట్ కోసం వెతుకుతుంటారు. కానీ రామ్ చరణ్ ‘పెద్ది’ టీమ్ మాత్రం సైలెంట్ గా ఒక బాంబు పేల్చింది. అంతా అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో సడన్ గా సెట్ లోకి ఒక స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బుచ్చిబాబు సానా ఈ సినిమాను కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామాగా మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర క్లిక్కయ్యేలా ఒక పక్కా కమర్షియల్ ప్యాకేజీలా మార్చే పనిలో పడ్డారు. అందుకే షూటింగ్ ఆఖరి అడుగులో ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ ను యాడ్ చేశారు.

 

పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ రోజు నుంచే హైదరాబాద్ లో షూటింగ్ మొదలైనట్లు సమాచారం. ఒక నాలుగు రోజుల పాటు జరిగే ఈ షూట్ తో ‘పెద్ది’ మొత్తం షూటింగ్ పార్ట్ క్లోజ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే లాంటి పేర్లు వినిపించినా, చివరికి శృతి హాసన్ ను ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఆమెకున్న నేషనల్ వైడ్ గుర్తింపు సినిమా బిజినెస్ కు, ముఖ్యంగా నార్త్ మార్కెట్ కు పెద్ద ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తర్వాత చరణ్ తన పాన్ ఇండియా మార్కెట్ ను మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ‘పెద్ది’ ప్యూర్ రూరల్ నేటివిటీ ఉన్న సినిమా కాబట్టి, దీన్ని హిందీ ఆడియన్స్ కు సెల్ చేయాలంటే ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఉండాల్సిందే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి శృతి హాసన్ గ్లామర్ తోడైతే, ఆ పాట ఇచ్చే బజ్ తోనే సినిమా సగం సక్సెస్ అవుతుందని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రమోషన్లకు ఈ పాటను ఒక లాంచ్ ప్యాడ్ లా వాడుకోబోతున్నారు.

టెక్నికల్ గా చూస్తే రెహమాన్ జానీ మాస్టర్ కాంబోలో చరణ్ చిందేయడం అనేది ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే విషయమే. ఈ పాట కోసం సెట్ ను కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఈ సాంగ్ ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ అని చెప్పాలి. కంటెంట్ ఎంత బాగున్నా, ఇలాంటి కమర్షియల్ హంగులు తోడైతేనే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు నిలకడగా ఉంటాయి. అందుకే మేకర్స్ ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చు పెడుతున్నారు.

నిజానికి బుచ్చిబాబు తన ఫస్ట్ సినిమా నుంచే మ్యూజిక్ కు, హీరోయిన్ సెలెక్షన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు. ఇప్పుడు చరణ్ లాంటి స్టార్ ను హ్యాండిల్ చేసేటప్పుడు ఆ బాధ్యత మరింత పెరిగింది. ‘పెద్ది’ లో చరణ్ లుక్ చాలా రగ్డ్ గా ఉంటుందని అప్డేట్స్ తో క్లారిటీ ఇచ్చారు, దానికి కాంట్రాస్ట్ గా ఈ సాంగ్ లో శృతి హాసన్ గ్లామర్ సినిమాకు కలర్ ఫుల్ ఫీల్ ఇస్తుందట. జూన్ లో సినిమాను థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో టీమ్ డే అండ్ నైట్ వర్క్ చేస్తోంది. షూటింగ్ అయిపోగానే ప్రమోషన్స్ స్పీడ్ పెంచబోతున్నారు. ఇక ‘పెద్ది’ టీమ్ వేసిన ఈ ఆఖరి అస్త్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News