• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈసారి 'సీటిమార్'...

ఈసారి 'సీటిమార్' అనబోతున్న సల్లు భాయ్!

By - Tupaki Desk
Update: 2020-06-09 01:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినా ఒక పాట హిట్ అయినా వెంటనే బాలీవుడ్ కన్ను పడుతుంది. వెంటనే బాలీవుడ్ నిర్మాతలు హీరోలు రీమేక్ చేస్తూనే ఉంటారు. అలాగని రీమేక్ చేసి ఫెయిల్ అవ్వరు. తెలుగు రేంజ్ కాకపోయినా మోస్తరు విజయం అయినా సాధిస్తారు. ఇక గతంలో తెలుగు సాంగ్స్ రీమేక్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అందులో ఆకలేస్తే అన్నం పెడతా.. అనే సాంగ్ భారీ హిట్ అనే విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మరోసారి టాలీవుడ్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ పాట రీమిక్స్‌కు కాలు కదపనున్నాడట. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘రాధే: ది మోస్ట్ వాంటెడ్‌ భాయ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకి స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దిశా పటానీ, రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 22న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించింది కానీ లాక్‌డౌన్‌ కారణంగా కుదరలేదు.

అయితే ఈ సినిమా కోసం ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాలోని ‘సీటీమార్‌..’ పాటను రీమిక్స్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ నటించిన ‘ఆర్య 2’లోని ‘రింగ రింగ..’ పాటను సల్మాన్‌ ‘రెడీ’ సినిమా కోసం రీమిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ పాటను ‘డింకచికా.. డింకచికా..’గా రూపొందించాడు దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు మరోసారి సల్మాన్‌ టాలీవుడ్‌ పాటకు స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ రీమిక్స్‌ కోసం పనిచేస్తున్నారు. దేవి, సల్మాన్‌ 2011లో ‘డింక చికా..’ పాట కోసం కలిసి పనిచేశారు. ‘సీటీమార్‌..’ రీమిక్స్‌ కూడా అందర్నీ అలరిస్తుందని’ విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సల్మాన్‌ 2019లో ‘భారత్‌’, ‘దబాంగ్‌ 3’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్లు భాయ్. రాధాతో బిజీ ఉన్నాడు. ఇదిలా ఉండగా సల్మాన్ ఫర్హాద్‌ సాంజీ కాంబినేషన్‌లో ‘కబి ఈద్‌ కబి దివాళీ’ సినిమా కూడా చేయనున్నాడు.
Tags:    
  • salman khan 
  • Allu arjun 
  • seeti maar 
  • Bollywood 
  • Tollywood 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS