అప్పుడే ప్యాకప్‌ చెప్పేసిన సూపర్‌ స్టార్‌

Update: 2020-10-16 04:00 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే' సినిమా ఈ ఏడాది రంజాన్‌ కు విడుదల చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా సినిమాను ఈద్‌ కు విడుదల చేయడం కుదరలేదు. షూటింగ్‌ ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది చివరి వరకు రాధే సినిమా షూటింగ్‌ లో సల్మాన్‌ పాల్గొంటాడు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఏడాది కొత్త సినిమాలో సల్మాన్‌ నటిస్తాడు అనుకుంటూ ఉండగా అప్పుడే రాధే సినిమా షూటింగ్‌ ను ముగించినట్లుగా స్వయంగా సల్మాన్‌ ప్రకటించాడు. షూటింగ్‌ చివరి రోజు వ్రాప్‌ (ముగిసింది) అంటూ చెప్పడంతో షూటింగ్‌ పూర్తి అయ్యిందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

సల్మాన్‌ వ్రాప్‌ అంటూ చెప్పిన వీడియోను షేర్‌ చేసిన రాధే టీం మెంబర్స్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ లో ఉన్నారు. ఒక వైపు బిగ్‌ బాస్‌ షో చేస్తూనే మరో వైపు రాధే సినిమాను ఇంత స్పీడ్‌ గా అది కూడా తక్కువ మంది కాస్ట్‌ అండ్‌ క్రూ తో ఎలా పూర్తి చేశారంటూ బాలీవుడ్‌ మేకర్స్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాధే సినిమాను మరీ సింపుల్‌ గా మడిచేశారా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్‌ సాదారణంగా ఒక్క సినిమాకు తీసుకునే సమయంలో రాధే సినిమాకు సగం సమయం మాత్రమే తీసుకున్నాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ లో లేదా అంతకంటే ముందే థియేటర్లు పూర్తి స్థాయిలో రన్‌ అయ్యేప్పుడు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సల్మాన్‌ కు జోడీగా ఈ సినిమాలో దిశా పఠాని హీరోయిన్‌ గా నటించింది. కీలక పాత్రలో జాకీ ష్రాఫ్‌ మరియు రణ్‌ దీప్‌ హుడాలు నటించారు.
Full View
Tags:    

Similar News