ఫ్యాన్ కి సింగర్ ఛాన్స్ ఇచ్చిన హీరో

Update: 2016-05-29 11:30 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి యాక్టర్ గా ఎంత మంచి పేరుందో.. చుట్టూ అన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మనసున్న మంచి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నాడు సల్మాన్. ఈ కండలవీరుడిని మంచోడని నిరూపించే ఘటనలు ఇప్పటికే చాలా జరిగినా.. రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం సల్మాన్ ఎలాంటి వాడో అందరికీ చాటి చెప్పింది.

ప్రస్తుత సుల్తాన్ షూటింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్న సల్లూ భాయ్.. తన షూటింగ్ స్పాట్ కి దగ్గరలో జరుగుతున్న సరిగమప మ్యూజిక్ షో రిహార్సల్స్ కు వెళ్లాడు. ఇలాంటి షోలలో సెలబ్రిటీల విజిట్స్ సాధారణమే అయినా.. అక్కడ జరిగిన సంఘటనే అసలు హైలైట్ గా నిలిచింది. ఈ రిహార్సల్స్ లో కెనడాలో నివాసం ఉంటున్న జగ్ ప్రీత్ బాజ్వా అనే వ్యక్తి కూడా పాల్గొంటున్నాడు. ఇతను సల్మాన్ కి వీరాభామాని.

అంగవికలుడైన జగ్ ప్రీత్ ట్యాలెంట్ చూసి కదిలిపోయిన సల్మాన్ ఖాన్.. అతగాడితో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాడట. తన నెక్ట్స్ మూవీలో సింగర్ గా ఛాన్స్ ఇస్తానని చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడట సల్మాన్. తన అభిమాన హీరో తన దగ్గరికే నడిచొచ్చి, బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడంతో.. జగ్ ప్రీత్ కి నోట మాట రాలేదు.
Tags:    

Similar News