అర్ధ నగ్నంగా హీరోయిన్ రన్నింగ్ షాట్.. నవదీప్ చూసి..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదీప్ ప్రస్తుతం లవ్ మౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-02 04:38 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదీప్ ప్రస్తుతం లవ్ మౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత.. సరికొత్తగా, నవదీప్ 2.0గా ఆయన నటిస్తున్న మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా మిస్ ఇండియా కంటెస్టెంట్ పంఖురి గిద్వానీ నటిస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ కావాల్సిన చిత్రం.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొద్ది రోజుల్లో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రానుంది.

అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అడ్వెంచర్స్ చేస్తూ.. ఒంటరిగా జీవించే వ్యక్తిగా హీరో (నవదీప్) కనిపించారు. సినిమాలో హీరో మనస్తత్వం ఏంటో ప్రేక్షకులకు కొన్ని డైలాగుల ద్వారా ఈజీగా అర్థమయ్యింది. 'ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు.. ఎంత సంపాదిస్తాన్నామో చూసి పెళ్లి చేసుకుంటారు.. దీంట్లో లవ్ ఎక్కడుంది?' వంటి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇక లవ్ మౌళి సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ట్రైలర్ లో నవదీప్ ఒక సీన్‌ లో నగ్నంగా కనిపించనున్నట్టు మేకర్స్ చూపించారు. హీరోయిన్ పంఖురి కూడా టాప్‌ లెస్‌ గా కనిపించనుందని తెలుస్తోంది. మరో సీన్ లో సెమీ డ్రెస్ లో నవ్వుతూ హీరోయిన్ పరిగెత్తుతున్నట్లు చూపించారు. అయితే ఆ సీన్ షూట్ చేసిన సమయంలో జరిగిన ఓ విషయాన్ని పంఖురి రీసెంట్ గా షేర్ చేసుకుంది.

"ఆ సీన్ షూట్ చేసినప్పుడు నేను సిలికాన్ మినీ టాప్ వేసుకున్నా. కానీ షూటింగ్ స్పాట్ లో వేడి ఎక్కువగా ఉంది. దీంతో చెమట బాగా రావడంతో ఆ సిలికాన్ క్యాప్స్ జారిపోయాయి. రన్నింగ్ షాట్ తర్వాత నవదీప్ తో మరో సీన్ చేయాల్సి ఉంది. సిలికాన్ క్యాప్స్ లేకుండానే ఆ సీన్ పూర్తి చేశా. డైరెక్టర్ కట్ చెప్పాక ఆ విషయాన్ని నవదీప్ గమనించారు. వెంటనే షాకయ్యారు. ముఖం మరోవైపు తిప్పుకున్నారు" అని తెలిపింది పంఖురి.

తాను కవర్ చేసుకోవడానికి అర్జెంట్ గా క్లాత్ తీసుకురావాలని షూటింగ్ డిపార్ట్మెంట్ పై నవదీప్ గట్టిగా అరిచారని పంఖురి చెప్పింది. అలా సెట్స్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. నవదీప్ లో మెచ్చుకోదగిన లక్షణమని కొనియాడింది. అయితే పంఖురి ప్రశంసలపై వ్యంగ్యంగా స్పందించారు నవదీప్. 'అంటే జనరల్ పబ్లిక్ టాక్ అలా ఉంటే ఏం చేస్తాం?' అని అన్నారు. మరి ఈ సినిమాతో నవదీప్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News