250 రోజుల్లో సలార్

Update: 2023-01-22 04:00 GMT
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ స్వయంగా రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని విజయ్ కిరంగదూర్ హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా... హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా... డిసెంబర్ 2020లో ప్రకటించారు.

సినిమా ప్రకటించిన నాటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి సంగీతమందించడం అదే సినిమాకి సినిమా ఆటోగ్రఫీ అందించిన భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉండడంతో సినిమా మీద భారీ అందించడంతో నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ 2022లోనే విడుదల చేయాలి అనుకున్నారు. కానీ అనేక దఫాలుగా వచ్చిన కరోనా వల్ల ఈ సినిమా ప్రొడక్షన్ లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని సెప్టెంబర్ 25-8-2023వ సంవత్సరంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

సరిగ్గా ఈరోజుకి సెప్టెంబర్ 28వ తారీకు 250 రోజులు ఉన్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగే జరుగుతుందేమో అని ముందు జాగ్రత్తతో ఈ సినిమా యూనిట్ ఖచ్చితంగా 250 రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సలార్ అనే పాత్రలో నటిస్తున్నారు.

ఇక వీరు గాక మధు గురుస్వామి, ఈశ్వర్ రావు, శ్రేయ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని తమిళ, కన్నడ, మలయాలం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అంచనాలైతే ఉన్నాయి. అయితే అది ఎంతవరకు నిజమవుతుందనేది కాలమే నిర్ణయించాలి మరి.
Tags:    

Similar News