సాయిపల్లవి ‘విరాటపర్వం’ లుక్‌ కు ఫిదా

Update: 2020-05-09 06:30 GMT
రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా రూపొందుతున్న చిత్రం విరాటపర్వం. ఈ చిత్రంకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం చాలా ఆలస్యం అవుతోంది. మొదటి నుండి ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్‌ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది నేడు విడుదలైన ఆమె బర్త్‌ డే పోస్టర్‌. అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని దేని కోసమో ఎదురు చూస్తున్న ఒక సామాన్యమైన అమ్మాయిగా సాయి పల్లవి లుక్‌ ఫిదా చేస్తోంది.

ఇలాంటి పాత్రలు సాయి పల్లవికి వెన్నతో పెట్టిన విధ్య అని ఫిదా చిత్రంతోనే నిరూపితం అయ్యింది. ఈ చిత్రంతో మరోసారి సాయి పల్లవి సక్సెస్‌ దక్కించుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. విరాటపర్వం నుండి ఇప్పటి వరకు రానా లుక్‌ రాలేదు. అయినా కూడా సాయి పల్లవి లుక్‌ ను రివీల్‌ చేశారంటే ఏ రేంజ్‌ లో ఈ సినిమాలో ఆమెకు ప్రాముఖ్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంను సాయి పల్లవి చాలా ఇష్టంగా చేస్తున్నట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

విరాటపర్వం సాయి పల్లవి పోస్టర్‌ లో రెవల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌ అంటూ ట్యాప్‌ పెట్టారు. నక్సలైట్ల బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే ప్రేమ కథగా తెలుస్తోంది. షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయిన ఈ చిత్రంను లాక్‌ డౌన్‌ తర్వాత పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. సాయి పల్లవి మరో వైపు నాగచైతన్యతో కలిసి లవ్‌ స్టోరీ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది.
Tags:    

Similar News