మ‌హేష్ ఫోటోల్ని జూమ్ చేసి చూస్తున్న రౌడీ బేబి

Update: 2020-12-17 05:02 GMT
ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌విపై మీడియా ఫోక‌స్ కాస్తంత ఎక్కువే. ఇటీవ‌ల‌ జాతీయ మీడియా కూడా త‌నపై ఎక్కువ ఫోక‌స్ చేస్తోంది. తాజాగా సాయిప‌ల్ల‌వి కొత్త వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ మ‌ల‌యాళీ బ్యూటీ తన ప్రయాణం గురించి మీడియా ఇంట‌ర్వ్యూల్లో ముచ్చ‌టిస్తోంది.

మహేష్ బాబుతో కలిసి పనిచేయడం గురించి అడిగినప్పుడు సాయి పల్లవి ఏదో ఒక‌ రోజు సూప‌ర్ స్టార్ తో కలిసి పనిచేస్తాన‌ని ఆస‌క్తిని వ్య‌క్తం చేసింది. ఇదే వేదిక‌పై మహేష్ గురించి ఈ బ్యూటీ బోల్డ్ కామెంట్ వేరొక‌టి వైర‌ల్ అవుతోంది.

మ‌హేష్ అందం గురించి అడిగినప్పుడు సాయి పల్లవి ఏమ‌ని అందంటే... “అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఒక వ్యక్తి అంత అందంగా కనిపించడం దాదాపు అసాధ్యం అని నేను భావిస్తున్నాను. నేను తరచూ అతని చిత్రాలను జూమ్ చేస్తాను. అతను మచ్చలేనివాడని అనుకుంటున్నాను. అతని చర్మం మచ్చలేనిది. అన్నివేళ‌లా ప్ర‌కాశించే చంద్రుడు`` అంటూ వ్యాఖ్యానించింది.

సాయి పల్లవి కెరీర్ ఆరంభం మొటిమలతో సమస్యలను ఎదుర్కొంది. ఆ క్ర‌మంలోనే ప‌లు అవ‌కాశాల్ని జార‌విడిచింది. ఓ ఫెయిర్ ‌నెస్ క్రీమ్ ను ఆమోదించడానికి 2 కోట్ల ఆఫర్ ‌ను కూడా ఆమె తిరస్కరించింది. కానీ ఇప్పుడు మహేష్ గ్లామర్ గురించి సాయి ప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్యలతో మహేష్ అభిమానులు చాలా ఖుషీ అయ్యారు.
Tags:    

Similar News