కోటిన్న‌ర ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి...?

Update: 2020-06-25 06:52 GMT
మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది సాయి పల్లవి. ఫస్ట్ సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత 'ఎంసీఏ' 'పడి పడి లేచే మనసు' 'కణం' చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది. అందం - అభినయం - అదృష్టం అన్నీ కలబోసిన సాయి పల్లవి సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి కమెర్షియల్ సినిమాలవైపు పరుగులు తీయకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు మలయాళ తమిళ చిత్రాల్లో బిజీగా ఉంటూ సౌత్‌ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఇక 'రౌడీ బేబీ' సాంగ్ కి స్టెప్పులేసి సాయి పల్లవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆమె డ్యాన్సులకు యూట్యూబ్ రికార్డ్స్ బద్దలయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం నాగచైతన్య 'లవ్ స్టోరీ'.. రానా 'విరాటపర్వం' సినిమాల్లో నటిస్తోంది. డాన్స్ లో పట్టు ఉండటం వలన సాయి పల్లవిని కింద సెంటర్స్ ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మడిని ప్రత్యేక గీతాల్లో నర్తింప చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం సాయి ప‌ల్ల‌వికి ఓ ఐట‌మ్ సాంగ్ ఆఫ‌ర్ వచ్చిందట. దీని కోసం ఈ బ్యూటీకి దాదాపు కోటిన్న‌ర ఆఫ‌ర్ చేశారట సదరు చిత్ర యూనిట్. అయితే సాయి ప‌ల్ల‌వి ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేసినప్పటికీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదని ఆలోచించిందట. దీంతో ఈ ప్రత్యేక గీతం కోసం మరో స్టార్ హీరోయిన్ ని తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటున్నారట. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో ఐటమ్ సాంగ్ లో నర్తించడానికి ఈ బ్యూటీని సంప్రదించారట. అయితే సాయిపల్లవి రిజెక్ట్ చేసిందట. దీనితో సాయి ప‌ల్ల‌వి ప్లేస్ లో ఆ సాంగ్ లో స్టెప్పులేయడానికి మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ని తీసుకున్నారట. ఈ సాంగ్ సినిమాకి ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఫిదా బ్యూటీ ప్రత్యేక గీతాల్లో స్టెప్పులేయడానికి సిద్ధంగా లేదని ఈ రెండు ఇన్సిడెంట్స్ తో అర్థం అయిపోయింది.
Tags:    

Similar News