వచ్చే ఏడాది రెండు పక్కా అంటున్నాడు

Update: 2020-12-16 14:30 GMT
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ నెల 25వ తారీకున క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సమ్మర్‌ లో విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. థియేటర్లు రీ ఓపెన్‌ అయిన తర్వాత విడుదల అవుతున్న మొదటి పెద్ద సినిమా అవ్వడంతో అంతా కూడా ఈ సినిమా వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా తేజ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగా తేజ్‌ తన తదుపరి సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో నటిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్‌ పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది. ఆ వెంటనే బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. సుకుమార్‌ లు కలిసి నిర్మించబోతున్న పీరియాడికల్‌ మూవీలో నటించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. 1970 మరియు 80 కాలంలో సాగే ఈ సినిమాకు కార్తీక్‌ దన్ను దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని తేజు భావిస్తున్నాడట.
Tags:    

Similar News