• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RDX ఎఫెక్ట్.. డేంజర్ జోన్...

RDX ఎఫెక్ట్.. డేంజర్ జోన్ లో RX పాప!

By - Tupaki Desk
Update: 2019-11-08 08:00 GMT
ఇండస్ట్రీ లో ఒక్క హిట్ తగిలితే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటారు చాలామంది.  కానీ అన్నిసార్లు అందరికీ అలా జరగదు.  సూపర్ హిట్ దక్కిన తర్వాత కష్టాలు ఎక్కువవుతాయి.  ఆ హిట్ నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది.  సినిమా ఫలితాలు తేడా కొడితే మళ్ళీ అవకాశాల కోసం అన్నీ గడపలు ఎక్కి దిగాల్సి వస్తుంది. ప్రస్తుతం పాయల్ కు అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది.

డెబ్యూ సినిమా 'RX100' తో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది పాయల్ రాజ్ పుత్.  బోల్డ్ గా నటించడంతో ప్రేక్షకుల్లో గుర్తింపు కూడా తెచ్చుకుంది. అవకాశాలు కూడా పాయల్ ను వెతుక్కుంటూ వచ్చాయి.  అయితే పాయల్ తర్వాత నటించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  క్యామియో చేసిన 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. ఐటెం సాంగ్ చేసిన 'సీత' తో పాటు మెయిన్ లీడ్ గా నటించిన 'RDX లవ్' సినిమాలు నిరాశపరిచాయి.  'RDX లవ్' గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పాయల్ కు కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని ఈ సినిమా చెడగొట్టింది. పాయల్ బీ గ్రేడ్ సినిమాల హీరోయిన్ అనే ఫీలింగ్ కలిగేలా చేసిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి.  

దీంతో పాయల్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రెండు సినిమాలపైనే నమ్మకం పెట్టుకుంది.  వాటిలో ఒకటి 'వెంకీమామ' కాగా రెండోది 'డిస్కోరాజా'.  రెండు సినిమాల్లో పాయల్ సోలో హీరోయిన్ కాదు.  పాయల్ ను డామినేట్ చేసే హీరోయిన్లు ఉన్నారు.  'వెంకీమామ' లో నటిస్తున్న రాశి ఖన్నా అటు నటనలోనూ గ్లామర్ లోనూ ఫస్ట్ క్లాస్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది.   మరోవైపు 'డిస్కోరాజా' లో నటిస్తున్న మరో హీరోయిన్ నభ నటేష్ కూడా అదే టైపు.. 'ఇస్మార్ట్ శంకర్' హిట్టుతో ఫుల్ జోష్ మీద ఉంది. కాబట్టి ఈ సినిమాలు హిట్ అయినా పాయల్ కు మొత్తం క్రెడిట్ దక్కే అవకాశాలు తక్కువ.  ఒకవేళ అటూ ఇటూ అయితే పాయల్ కు టాలీవుడ్ లో టఫ్ టైమ్ స్టార్ట్ అయినట్టేనని అంటున్నారు. చూద్దాం.. పాప అదృష్టం ఎలా ఉందో.
Tags:    
  • Payal Rajput 
  • RX 100 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Latest News 
  • Telugu News 
  • RDX Love 
  • Tupaki News 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS