అక్కడ 'ఆర్‌ ఎక్స్‌ 100' వచ్చేది ఎప్పుడంటే..!

Update: 2021-02-18 12:30 GMT
కార్తికేయ.. పాయల్‌ రాజ్‌ పూత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఎక్స్ 100 సినిమా తెలుగులో సూపర్‌ హిట్ అయ్యింది. దర్శకుడితో పాటు హీరో హీరోయిన్ అందరికి కూడా మంచి పేరు వచ్చింది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహన్‌ శెట్టి హీరోగా ఈ రీమేక్ తో పరిచయం కాబోతున్నాడు. తడాప్ టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా లో అహన్ శెట్టికి జోడీగా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ తార సుతారీ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. గత ఏడాది మార్చిలో సినిమా పునః ప్రారంభం అయ్యింది. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని... రీమేక్‌ విడుదల కు సిద్దం అవుతున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సమ్మర్‌ లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కార్తికేయకు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినట్లుగా అహన్ శెట్టి కూడా తడాప్ సినిమాతో బాలీవుడ్‌ లో మంచి ఎంట్రీని దక్కించుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అధికారిక విడుదల తేదీ ఒకటి రెండు వారాల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News