• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రుద్ర' ట్రైలర్: డిజిటల్...

'రుద్ర' ట్రైలర్: డిజిటల్ డెబ్యూలో అజయ్ - రాశీఖన్నా అదరగొడతారా?

By - Tupaki Desk
Update: 2022-02-14 10:48 GMT
'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌' అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ - బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు వెండితెర మీద అలరించిన వీరిద్దరూ.. ఇప్పుడు ఓటీటీ స్క్రీన్ల మీదకు వచ్చేస్తున్నారు. సైకలాజికల్ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రాజేష్‌ మపుస్కర్‌ ఈ ఒరిజినల్ ను తెరకెక్కిస్తున్నారు.

ఇద్రీస్ ఎల్బా రూపొందించిన 'లూథర్‌' అనే పాపులర్ బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌ ఆధారంగా ''రుద్ర'' ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ అఫిసియల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌' సిరీస్ ను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు డిస్నీ హాట్ స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా వదిలిన ట్రైలర్ ఆద్యంతం ఉత్కఠకరంగా సాగింది. 'చీకట్లో దాక్కున్న వాళ్ళను, నేను అక్కడికి వెళ్లే పట్టుకుంటాను' అని అజయ్ దేవగన్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.

ఇందులో డీసీపీ రుద్రవీర్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజయ్ దేవగన్ కనిపిస్తున్నారు. తన కెరీర్‌ లో ఇప్పటికే ఎన్నో శక్తిమంతమైన పోలీసు పాత్రల్ని పోషించిన అజయ్‌.. ఇప్పుడు ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని క్రైమ్‌ డ్రామాతో వస్తున్నాడని తెలుస్తోంది.

ఎలాంటి కేసునైనా ఛేదించగలిగిన ఎంతటి భయంకరమైన కిల్లర్‌ నైనా రుద్ర.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది. భార్యతో విడిపోయి.. ఆలియాతో విచిత్రమైన స్నేహాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ముంబై నగరంలో జరుగుతున్న హత్యలను ఛేదించే క్రమంలో ఓ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ఇందులో రుద్రకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? కిల్లర్ ఎవరు? హత్యల వెనుక అసలు మోటివ్ ఏంటి? చిరవకు రుద్ర కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా? అలానే అతని భార్యతో విడిపోవడానికి కారణమేంటి? అతని ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫర్సనల్ లైఫ్ ఏ మేరకు ప్రభావాన్ని చూపించింది? అనేది ''రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌'' సిరీస్ లో చూపించారని ట్రైలర్ ని బట్టి అర్థం అవుతుంది.

ఇందులో అజయ్ దేవగన్ భార్యగా ఈషా డియోల్ కనిపించగా.. రాశీ ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. రాశీ లుక్ మరియు ఆమె పాత్ర తీరుతెన్నులు కొత్తగా డిఫెరెంట్ గా ఉన్నాయి. అతుల్ కులకర్ణి - అశ్విని కల్సేకర్ - తరుణ్ గెహ్లాట్ - ఆశిష్ విద్యార్థి మరియు సత్యదీప్ మిశ్రా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తుంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇతర క్రైమ్ థ్రిల్లర్‌ల మాదిరిగానే కనిపిస్తుంది.

అజయ్ దేవగన్ - రాశీ కన్నా వంటి స్టార్స్ మొదటిసారి చేస్తున్న సిరీస్ కావడంతో ఏదో ప్రత్యేక ఉంటుందని భావించవచ్చు. ట్రైలర్ లో విజువల్స్ మరియు బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టైటిల్ కు తగ్గట్టుగానే ఎక్కువ శాతం ఈ సిరీస్ రాత్రి సమయంలోనే సాగుంతుందని తెలుస్తోంది.

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ మరియు బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు కలిసి ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని నిర్మించాయి. హిందీతో పాటుగా తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం మరియు బెంగాలీ భాషల్లో 'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌' సిరీస్ ప్రసారం కానుంది.


Full View
Tags:    
  • rudra 
  • ajaydevagan 
  • raashikhanna 
  • trailer 
  • digitaldebut 
  • movienews 

Similar News

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS