డైసీ రీప్లేస్ మెంట్ కోసం జోరుగా..

Update: 2019-04-30 07:49 GMT
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' ఇప్పుడు సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యుక్తవయసులో ఉండే కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుర్రవాడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.  రామ్ చరణ్ పాత్రకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సెట్ అయింది కానీ ఎన్టీఆర్ పాత్రకు జోడీ విషయంలో మాత్రం ఇంకా సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది.

మొదట ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి  డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. కానీ ఆమె షూటింగ్ లో జాయిన్ కాకమునుపే వ్యక్తిగత కారణాలతో సినిమానుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. దీంతో డైసీ స్థానంలో మరో విదేశీ హీరోయిన్ కోసం రాజమౌళి టీం వెతకడం మొదలు పెట్టారు. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభం అయింది కాబట్టి.. RRR క్యాస్టింగ్ వ్యవహారాలు చూసే క్యాస్టింగ్ ఏజెన్సీ వారు విదేశీ అమ్మాయిని ఫైనలైజ్ చేసే పనిలో తెగ బిజీగా ఉన్నారట.

ఇదిలా ఉంటే కొమరం భీమ్ ముగ్గురిని వివాహం చేసుకున్నాడని చరిత్రలో ఉంది.  అయితే సినిమాలో మాత్రం ఈ విదేశీ వనితతో రొమాన్స్ కీలకంగా ఉంటుందట.  మరోవైపు నిత్య మీనన్ ను కొమరం భీమ్ కు మరో భార్య పాత్ర కోసం ఎంపిక చేశారట.  మరి ఈ సినిమాలో కొమరం భీమ్ ముగ్గురు భార్యలను చూపిస్తారా లేదా ఈ ఇద్దరితోనే సరిపెడతారా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Tags:    

Similar News