#ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 5
కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఆరు ఏడు నెలలుగా నిలిచి పోయిన షూటింగ్స్ ను మెల్లగా పునః ప్రారంభిస్తున్నారు. గత నెలలోనే చాలా సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెలలో మరికొన్ని సినిమాల షూటింగ్స్ కు రెడీ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా షూటింగ్ ను ఈనెల 5 నుండి ప్రారంభించేందుకు జక్కన్న ఏర్పాట్లు చేశారట. షూటింగ్ లో పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కరోనా టెస్ట్ చేయించుకున్నారట. మరో సారి కూడా వారికి రేపు అంటే ఆదివారం కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించబోతున్నారట. కోవిడ్ జాగ్రతలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఆరోగ్యంను పరిశీలిస్తూ షూటింగ్ ను కొనసాగించేందుకు జక్కన్న సిద్దం అయ్యాడు.
సోమవారం ఉండి ప్రారంభం కాబోతున్న షూటింగ్ లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గొనబోతుంది. వారం నుండి పది రోజుల పాటు ఎన్టీఆర్ పై షూట్ చేయబోతున్నారు. మొదట ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించిన షాట్స్ ను జక్కన్న రెడీ చేయబోతున్నాడు. చరణ్ ఫస్ట్ లుక్ ప్రోమో వచ్చి చాలా నెలలు అయ్యింది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తే ఒక పనైపోతుందనే ఉద్దేశ్యంతో యూనిట్ సభ్యులు మొదటగా అదే పని పెట్టుకున్నారట. రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఎన్టీఆర్ కొమురం భీమ్ గా రామ్ చరణ్ సీత రామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్ ను సాధ్యం అయినంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అయినా విడుదల చేయాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి ఆల్ ఇండియా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.