#RRR ‌రామ్ రామారావుల్ని బ్రేక్ డ్యాన్సాడిస్తున్నాడు!

Update: 2020-10-27 06:45 GMT
ఇండియాస్ బెస్ట్ పాన్ ఇండియా సినిమాని ఇలా షూట్ చేయాల్సి రావ‌డం జక్క‌న్న‌కు మింగుడు ప‌డడం లేద‌నే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ కోసం అత‌డు త‌పించినంత‌గా ఇంకెవ‌రూ త‌పించ‌రేమో. 2020 లో సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రంగా నిల‌పాల‌ని ఎంతో క‌ల‌గ‌న్నాడు. కానీ ఊహించ‌ని ఉరుములా మీద ప‌డింది కోవిడ్ మ‌హ‌మ్మారీ.

ఇది ఎంత‌గా డిస్ట్ర‌బ్ చేస్తోంది? అంటే అస‌లు జ‌క్క‌న్న కంటికి కునుకుప‌ట్ట‌నివ్వడం లేదు. ఇప్ప‌టికే కోవిడ్ సోక‌డంతో రాజ‌మౌళి ఒక‌మారు చికిత్స తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇక త‌న గురించి ఆలోచించ‌కుండా త‌న హీరోల‌కు ఏమాత్రం కోవిడ్ సోకే ఆస్కారం లేకుండా క‌ట్ట‌డి చేసేందుకు నానా ర‌కాలుగా త‌పిస్తున్నాడ‌ట‌. అందులో భాగంగానే కొద్దిరోజులు షూట్ చేయ‌డం అటుపై బ్రేక్ తీసుకోవ‌డం అన్న కొత్త ప్ర‌ణాళిక‌ను అనుస‌రిస్తున్నాడ‌ట‌. నిజానికి 15రోజుల షెడ్యూల్ ఉంది అంటే ప్ర‌తి మూడు రోజుల త‌ర్వాత ఒక‌రోజు బ్రేక్ తీసుకుని షూట్ చేస్తున్నాడ‌ట‌.

ఇక షూట్ ఫినిష్ చేయ‌డం కోసం రాజమౌళి ప్రతిపాదించిన షూటింగ్ షెడ్యూల్ ను రామారావు.. రామ్ చరణ్ య‌థావిధిగా అనుసరిస్తున్నారు. రాజ‌మౌళితో పాటే మూడు రోజులకు ఒక‌సారి విరామం తీసుకుంటున్నార‌ట‌. కోవిడ్ భారిన ప‌డ‌కుండానే ఈ ముంద‌స్తు జాగ్ర‌త్త అని తెలుస్తోంది. ఎన్టీఆర్..., చరణ్ లేదా సిబ్బందిలో ఎవరైనా వైరస్ బారిన పడటం రాజ‌మౌళికి ఎంత‌మాత్రం ఇష్టం లేదట‌. అయితే ఇలా చిత్రీక‌రిస్తే 2021 వేస‌వి నాటికి రిలీజ్ సాధ్య‌మేనా? అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. అయినా ఇప్పుడు చేసేదేం లేదు. అంద‌రూ కోవిడ్ రూల్స్ పాటించాల్సిందే క‌దా!
Tags:    

Similar News