• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  # RRR కు రంగం సిద్ధం...

# RRR కు రంగం సిద్ధం చేస్తుంటే ఈ కుండ‌పోత వ‌ర్షాలేమిటి?

By - Tupaki Desk
Update: 2020-10-14 03:45 GMT
రుతుప‌వ‌నాలు తుఫాన్ ల ప్ర‌భావం తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా లేదు. ఎన్న‌డూ లేనంత‌గా భారీ వ‌ర్షాల‌తో న‌గ‌రాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. రోడ్ల‌పైనే నీరు నిలిచిపోయి డ్రైనేజీలు బ్లాక్ అయిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ‌- విశాఖ‌ప‌ట్నం స‌హా ప‌లు న‌గ‌రాల్లో ఇదే స‌న్నివేశం నెల‌కొంది.

అయితే ఈ ప్ర‌భావం ఇత‌ర న‌గ‌రాల కంటే హైదరాబాద్ నగరంపైనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ స‌హా న‌గ‌రం పొరుగు ప్రాంతాలలో కుండ‌పోత‌గా వర్షాలు కుర‌వ‌డంతో పెద్దా- చిన్నా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. మీడియం-రేంజ్ సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ వారి షూటింగుల‌ను కూడా ఆపేయాల్సొచ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత షూటింగుల్ని వేగంగా పూర్తి చేయాల‌నుకున్న చిత్ర‌బృందాల‌కు ఇదో శ‌రాఘాత‌మే అయ్యింది. ఈ వారంలో ప్రారంభం కావాల్సిన ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ కి ఇది స‌మ‌స్యాత్మ‌క‌మే కానుంద‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే సెట్స్ లో  నాగ చైతన్య- అఖిల్ - వ‌రుణ్ తేజ్ -రవితేజ- నాని-సుశాంత్ స‌హా ప‌లువురి షూటింగులు జ‌రుగుతున్నాయి. అగ్ర‌ తారలు హైదరాబాద్ పరిసరాల్లో తమ చిత్రాల షూటింగ్‌ల కోసం ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. కొంద‌రు గత వారం షూటింగ్ ని పునఃప్రారంభించారు. మ‌రికొంద‌రు ఈ రెండ్రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధ‌మవుతున్నారు. అయితే ఊహించ‌ని పిడుగులా న‌గ‌రంపై తుఫాన్ విరుచుకుప‌డింది. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో షూటింగుల‌కు బ్రేక్ ఇస్తున్న‌ట్టు ప్రొడక్షన్ హౌస్‌లు వెల్లడించాయి.
Tags:    
  • Rrr Release Date 
  • Rrr Movie Motion Poster 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri 
  • Komaram Bheem 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS