#RRR : స్వాతంత్ర ఉద్యమ నేపథ్యం కాదట
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి ఏమైనా చెప్పమంటే చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఈ సినిమా అల్లూరి సీతారామరాజు మరియు కోమురం భీమ్ లు ఎలా స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించారు. ఆసమయంలో వారు బ్రిటీష్ వారిని ఎలా ఎదిరించారు అనేది కల్పిత కథాంశంగా రూపొందుతుంది అని చెప్తారు. ఏమాత్రం సినిమా జ్ఞానం ఉన్నా కూడా ఇదే చెప్తారు. సినిమా ప్రారంభం సమయంలో రాజమౌళి ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం అదే అనుకుంటారు ఎవరైనా. కాని తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన వీడియో మరియు తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇన్ని రోజులు జనాలు అనుకుంటున్నది అంతా తప్పు అంటూ తేల్చి పారేసింది.
రాజమౌళి బర్త్ డే సందర్బంగా ఒక ఫొటోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అందులో రెండు చేతులు కలిపి ఉన్నాయి. ఆ ఫొటోను చూస్తుంటే ఒక నెటిజన్ అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ లు ఇలా చేతులు కలిపి స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు ఆర్‌ఆర్‌ఆర్ అఫిషియల్ అకౌంట్ నుండి సమాధానం వచ్చింది. వారిద్దరు కలిశారు.. అవి వారి చేతులు అనడంలో సందేహం లేదు. కాని వారిద్దరు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయలేదు.
ఇది పూర్తిగా కల్పిత కథ మరియు ఇది దేశ భక్తి సినిమా కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. దాంతో మళ్లీ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది అసలు అప్పటి కాలానికి చెందినదేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బండిని వీడియోలో చూపించారు. అల్లూరి కాలంలో ఆ బండ్లు లేవు. అంటే ఇది ఆ కాలానికి చెందినది కాకపోవచ్చు. పాత్రలకు వారి పేర్లు మరియు ఆ పాత్రల స్వభావంను తీసుకున్నాడు తప్ప పూర్తి కథ వేరే అంటూ తాజా ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది.