ఔను నిజంగా షాక్ అవ్వాల్సిందే... ఈ మధ్య కాలంలో ఇండియాలో సినిమాలు 50 రోజులు ఆడటం గగనం అయ్యింది. మొదటి వారం సాధ్యం అయినంత ఎక్కువ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. సినిమా పాజిటివ్ టాక్ వచ్చి హిట్ అయితే మరో రెండు వారాలు లేదా మూడు వారాలు ఒక మోస్తరుగా వసూళ్లు రాబడుతూ థియేటర్లలో కొనసాగుతున్నాయి.
సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాలు థియేటర్ లో ఉండటం కష్టం అయ్యింది. 50 రోజులు థియేటర్లలో సినిమాలు ఆడుతున్న రోజులు ఎప్పుడో పోయాయి. అలాంటిది ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం.. అది కూడా జపాన్ లో ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకోవడం అద్భుతం అనాల్సిందే.
విదేశాల్లో మన సినిమాలు అడపా దడపా విడుదల అవుతూ ఉంటాయి. విడుదల అయిన మొదటి వారం లేదా రెండవ వారం వరకు వసూళ్లు రాబడుతూ ఉంటాయి. కానీ ఇలా 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు మాత్రం ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన దాఖలాలు లేవు.
ఆర్ఆర్ఆర్ సినిమా 42 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు మరియు 114 కేంద్రాల్లో షిప్ట్ పద్దతిలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక్కడ అంతా ఇంతా అంటూ ఘన వసూళ్లు నమోదు అయ్యాయి కానీ కనీసం 50 రోజులు కూడా థియేటర్లలో సందడి చేయలేదు. ఇక వంద రోజులు అంటే ఊహకు కూడా అందడం లేదు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అవ్వగా.. ఆస్కార్ నామినేషన్స్ ను కూడా మన నాటు నాటు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
జపాన్ లో వంద రోజులు పూర్తి చేసుకోవడం మరో అద్భుతమైన ఘనతగా చెప్పుకోవచ్చు. జపాన్ లో 100 రోజులు పూర్తి అయిన విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.