బీచ్ సొగ‌సుల వైజాగ్ లో `రౌడీ బేబీ` లాంచ్

Update: 2020-12-16 08:07 GMT
యూట్యూబ్ లో రౌడీ బేబి సాంగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. సాయి ప‌ల్ల‌వి- ధ‌నుష్ జంట ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌తో ఈ పాట క్రేజీగా యూత్ లో వైర‌ల్ అయిపోయింది. కోట్లాది మంది ఈ పాట‌ను యూట్యూబ్ లో వీక్షించారు. ఇప్ప‌టికీ ట్రెండ్ సెట్ చేస్తూ స‌రికొత్త రికార్డుల వైపు దూసుకెళుతోంది. ఇప్పుడు ఏకంగా ఈ రౌడీ బేబీనే టైటిల్ ని చేసేశారు కోన అండ్ టీమ్.

యువ‌హీరో సందీప్ కిషన్ క‌థానాయ‌కుడిగా జి నాగేశ్వరరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కోన వెంక‌ట్ నిర్మిస్తున్న తాజా సినిమాకి ‘రౌడీ బేబీ’ అని పేరు టైటిల్ ని నిర్ణ‌యించారు. తాజాగా వైజాగ్ లో లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పెద్దలు పాల్గొన‌గా.. పూజా వేడుకతో యూనిట్ ఈ రోజు షూట్ ప్రారంభించింది.

ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స‌మ‌ర్పిస్తున్నారు.  వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎంవివి సినిమాస్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. యూత్ సెన్సేషన్ ‘చౌరాస్త’ రామ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.
Tags:    

Similar News