ట్రైలర్ టాక్: భయపెడుతూనే నవ్విస్తున్న రూహి.. దయ్యంగా జాన్వీ!
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్త్రీ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హారర్ కామెడీ జానర్ లో ఆ స్త్రీ రికార్డు సృష్టించింది. తాజాగా స్త్రీ మేకర్స్ నుండి వస్తున్న చిత్రం రూహి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రలలో నటించారు. హార్థిక్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తాజాగా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రూహి ట్రైలర్ వచ్చేసింది. తాజాగా రూహి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులను సినిమాహళ్లకు రూహి ఈజీగా రప్పిస్తుందని అర్ధమవుతుంది. దాదాపు ఏడాది తర్వాత సినిమాహాళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి కాబట్టి రూహికి అదొక ఊరట అనే చెప్పాలి.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. రూహి(జాన్వీ), ఇద్దరు అబ్బాయిలు హితేష్ (రాజ్ కుమార్), లకన్ (వరుణ్)ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇది దయ్యం పట్టిన రూహి పెళ్లికూతుళ్లను వశపరచుకొని మగవారికి నిద్రలేకుండా చేసే దయ్యం రూహి కథ. అలాంటి దయ్యం నుండి గ్రామాన్ని కాపాడటానికి హీరోలు బాధ్యత తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చే గందరగోళం అంతా భయానకంగా ఉంటూనే హాస్యభరితంగా ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటే పూర్తి ఆహ్లాదభరితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. రాజ్ కుమార్ జాన్వీని చూసి పరిగెత్తే సీన్, వరుణ్ జాన్వీని పలట్ అని అడిగినప్పుడు చివరిలో 'కిత్నే క్యూట్ హోంగే హమారే బచ్చే' అనేవి ఫుల్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ లో కొన్ని మాత్రమే చూపించారు. స్త్రీ తర్వాత రాజ్ కుమార్ మళ్లీ కామిక్ టైమింగ్ తో రెడీ అయిపోయాడు. జాన్వీ దయ్యం పట్టిన అమ్మాయిగా బాగా చేసింది. మొత్తానికి ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మార్చ్ 11న థియేటర్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై ట్రైలర్ అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు. చూడాలి మరి జాన్వీ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో!
Full View