ఈ టీజర్ మహా బోల్డ్ గా ఉందిగా!

Update: 2019-05-11 12:53 GMT
ఇది బోల్డ్ సినిమాల కాలం.. లిప్పు లాకుల లోకం.  ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ పి. సునిల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'రొమాంటిక్ క్రిమినల్స్'.  ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు.. టీజర్ రిలీజ్ అయ్యాయి.  చెడుమార్గంలో ఉన్న యువత ఎలాంటి క్రైమ్స్ కు పాల్పడుతున్నారనేది ఈ సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.

టీజర్ గురించి మాట్లాడుకుంటే.. కాలేజిలో ఒక  అమ్మాయి అబ్బాయి రొమాన్స్ చేస్తూ ప్రిన్సిపాల్ దొరుకుతారు. "మీ ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నాను" అంటూ సిరియస్ అవుతారు ఆయన.  అప్పుడు హీరోయిన్ "సర్.. మీతో రెండు నిముషాలు పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది:" ప్రిన్సిపాల్ ఒప్పుకోడు.. నథింగ్ డూయింగ్ అంటాడు. దీంతో హీరోయిన్ "నన్ను నీ పక్కలో పడుకోమన్నావని.. రెండేళ్లుగా వాడుకుదొబ్బుతున్నావని ఏడుస్తూ టీవీ చానల్స్‌ లో కూర్చుంటా.  నాకు రెండు సార్లు అబార్షన్ చేయించావని నీ ఇంటి ముందు టెంట్ వేసి కూర్చుని మరీ పరువు తీస్తా.'' అంటూ బెదిరిస్తుంది.  కంటిన్యూ చేస్తూ "ఎక్కువ మాట్లాడితే కులం పేరు.. మతం పేరు కూడా తీసుకొస్తా ప్రిన్సిపల్ సర్... నేనొక పనికిమాలినదాన్ని" అంటూ బెదిరిస్తుంది.

ఈ డైలాగ్స్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో హీరోగా మ‌నోజ్ నంద‌న్‌ నటించాడు. హీరోయిన్లుగా అవంతిక‌.. దివ్య‌.. మౌనిక నటించారు.   వ్యసనాల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే కాన్సెప్ట్ తో సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించినట్టుగా నిర్మాతలు చెప్తున్నారు.  కాన్సెప్ట్ సంగతేమో కానీ టీజర్ క్వాలిటీ చూస్తే మరీ బీ-గ్రేడ్ సినిమాలాగా అనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు.. మీరూ ఒక లుక్కేయండి.

Full View

Tags:    

Similar News