రాకెట్రీ ట్రైలర్: ఎమోషన్ రగిలించిన స్పేస్ సైంటిస్టుగా మ్యాడీ ఆల్ రౌండర్ ప్రతిభకు హ్యాట్సాఫ్
అంతరిక్ష పరిశోధన.. రాకెట్ సైన్స్ నేపథ్యంలో సినిమా అంటే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో రక్తి కట్టించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎమోషనల్ కంటెంట్ తో ఎలివేషన్ కి అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించే వీలుంటుంది. ఇది ఒక సైంటిస్ట్ బయోపిక్ కథాంశం అయితే దేశం మొత్తం ఆసక్తిగా వేచి చూసేంత ఉత్కంఠ ఉంటుంది. ఇంతకుముందు అక్షయ్ కుమార్ - విద్యాబాలన్ నటించిన మిషన్ మంగళ్ ఈ తరహా సినిమానే. అంతరిక్ష పరిశోదన నేపథ్యంలో భారతీయ మహిళల విజయాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కి విజయం సాధించింది.
అయితే ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ఒక రియల్ సైంటిస్ట్ జీవితకథతో ఆర్.మాధవన్ `రాకెట్రి` సినిమాని తెరకెక్కించారు. ఆసక్తికరంగా ఈ సినిమాకి అన్నీ తానే అయ్యి పని చేశారాయన. ఆయనే కథానాయకుడు.. రచయిత.. దర్శకుడు.. నిర్మాత. పాన్ ఇండియా కేటగిరీలో ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా రాకెట్ట్రీ: నంబి ఎఫెక్ట్ ట్రెయిలర్ ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంచ్ చేశారు. ఆర్ మాధవన్ మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ గా ఈ చిత్రంలో అద్భుతంగా నటించారనడానికి ఈ ట్రైలర్ మచ్చు తునక.
ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఊహించని విధంగా విదేశీ గూఢచారి కుట్ర వల్ల కుంభకోణంలో చిక్కుకున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ భారతీయ శాస్త్రవేత్త.. ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ గా ఆర్ మాధవన్ నటించారు. ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ ని రగిలించిన తీరు ఆసక్తికరం. మ్యాడీ హావభావాలు ఎమోషనల్ కంటెంట్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక దర్శకరచయితగానూ మాధవన్ పనితనం ట్రైలర్ లో ఆశ్చర్యపరుస్తోంది.
ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా మాధవన్ మరోసారి మాస్టర్ క్లాస్ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిధి పాత్ర పోషించారు. అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ పేజీలో ఈ ట్రైలర్ ని షేర్ చేసి శుభాకాంక్షలు పంపారు. `ఆల్ ది వెస్ట్ బెస్ట్ మాడి` అని అమితాబ్ అన్నారు. మరో స్టార్ హీరో సూర్య కూడా తన ట్విట్టర్ పేజీలో ట్రైలర్ ని షేర్ చేసి.. మైండ్ బ్లోయింగ్ !!! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీరు చాలా అభిరుచితో చేసిన చిత్రమిది! యాక్టర్ మాధవన్ మన పరిశ్రమలో భాగమైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను! అని వ్యాఖ్యానించారు.
ఆర్ మాధవన్ రాకెట్ట్రీ: నంబి ఎఫెక్ట్ హిందీ- కన్నడ- మలయాళం- ఇంగ్లీష్- తమిళం- తెలుగు.. మొత్తం ఆరు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ట్రై కలర్ ఫిలిమ్స్- వర్గీస్ మూలన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Full View