• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆడియో వేడుకకు జస్ట్ పది...

ఆడియో వేడుకకు జస్ట్ పది కోట్లే...

By - Tupaki Desk
Update: 2017-09-10 06:07 GMT
ఏ భారతీయ సినిమా అయినా సరే.. ఆడియో వేడుకను భారీగా చేయాలనుకుటే.. కోటో రెండు కోట్లో ఖర్చు చేస్తుంటారు. కానీ ఇప్పటిదాకా ఏ ఆడియో వేడుకకైనా ఐదు కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడం చూశారా? విన్నారా? కానీ ఇప్పుడో సౌత్ ఇండియన్ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.0’. అవును.. ‘2.0’ ఆడియో వేడుక కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ వేడుకను దుబాయిలో నిర్వహించబోతున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేదికను కూడా వెల్లడించారు.

దుబాయిలోని ప్రసిద్ధ బుర్జ్ ఖలీఫా టవర్స్ ప్రాంగణంలోని బుర్జ్ పార్కులో అక్టోబరు 27న ‘2.0’ ఆడియో వేడుక చేయబోతుండటం విశేషం. ఆ పార్కులో వేడుక చేయడం కోసం అద్దె కిందే కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక ఇండియా నుంచి ఈ వేడుక కోసం అతిథుల్ని సొంత విమానాల్లో తీసుకెళ్లి తీసుకు రావడం కోసం కూడా భారీగానే ఖర్చవుతోంది. ఆడియో వేడుక రోజు ఎ.ఆర్.రెహమాన్ తన బృందంతో కలిసి ప్రత్యేక ప్రదర్శన కూడా ఇవ్వనున్నాడు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన కొందరు అతిరథ మహారథుల్ని ఈ వేడుకకు తీసుకెళ్తారని సమాచారం. అతిథులందరికీ బుర్జ్ ఖలీఫాలోనే బస కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ ఆడియో వేడుక ఇండియన్ సినిమానే కాదు.. ప్రపంచ సినిమా దృష్టిని కూడా ఆకర్షించడం ఖాయం. ఇక ‘2.0’ టీజర్ ను నవంబర్లో హైదరాబాద్ వేదికగా లాంచ్ చేయబోతుండగా.. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ రిలీజ్ చేస్తారు.
Tags:    
  • Rajinikanth 
  • Shankar 
  • Robo 2.0 Movie 
  • TElugu NEWs 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS