గూఢచారికే హ్యాండ్ ఇచ్చిన బ్యూటీ!

Update: 2018-07-28 01:30 GMT
'క్షణం', 'అమీ తుమీ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అడివి శేష్ మరోసారి హీరోగా 'గూఢచారి' సినిమాతో రాబోతున్నాడు.  ఆగష్టు 3 న రిలీజ్ కానున్న ఈ స్పై థ్రిల్లర్ కు  ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రమోలతో మంచి బజ్ క్రియేట్ అయింది.  దాంతో ఆగకుండా అడివి శేష్ వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింతగా క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతు వర్మను  మొదట అనుకున్నారు.  కానీ చివరి నిముషంలో సినిమాకు పనిచేయడం లేదంటూ 'గూఢచారి' కి చిన్నపాటి షాక్  ఇచ్చిందట రీతు.  దీంతో గత్యంతరం లేక వేరే హీరోయిన్ కోసం వెతకాల్సివచ్చిందట.  ఈ విషయంపై అడివి శేష్ మాట్లాడుతూ ఆ హీరోయిన్ వల్ల అప్సెట్ అయ్యానని ఓపెన్ గా ఒప్పుకున్నాడు.  షూటింగ్ ప్రారంభానికి తక్కువ సమయమే ఉన్నప్పటికీ లక్కీగా శోభిత ధూళిపాళ దొరకిందని - అందుకే ఇబ్బంది కలగలేదని అన్నాడు.  అడివి శేష్ సంగతి సరే  - మరి 'గూఢచారి' మిస్ అయినందుకు రీతు వర్మ రిగ్రెట్ అవుతుందా లేదా తెలియాలంటే మాత్రం ఆగష్టు 3 వరకూ వెయిట్ చేయక తప్పదు.

శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.  శశికిరణ్ తిక్కా దర్శకుడు కాగా, అడివి శేష్ కథ అందించడం విశేషం.  ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News