రిచా మాటలన్నీ ఖాళీ తూటాలేనా??

Update: 2017-12-11 17:01 GMT
ఇప్పుడు హర్వే వీనిస్టీన్ బాగోతం గురించి ఏమన్నా స్పందించడం అని అడగం మీడియాకు పరిపాటిగా మారిపోయింది. అలా అడిగిన వెంటనే.. అవును మన దగ్గర కూడా ఉంది.. కాని నా విషయంలో జరగలేదు అంటూ చెప్పడం హీరోయిన్లకు కూడా అలవాటైపోయింది. ఎవరిని అడిగినా కూడా #MeToo అంటూ స్పందించేస్తున్నారు. అయితే వీటిలో నిజంగానే నిజం ఉంది? ఒకవేళ ఉంటే ఎవరైనా నోరు విప్పుతారా?

ఇదే విషయంపై మొన్నామధ్యన బాలీవుడ్ హీరోయిన్.. గ్యాంగ్స్ ఆఫ్‌ వసేపూర్ ఫేం రిచా చద్దా మాట్లాడుతూ.. అవును బాలీవుడ్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. ఇక్కడ కూడా ముష్కరులు ఉన్నారు.. ఒక్కసారి హీరోయిన్లు నోరు తెరవడం స్టార్ట్ చేస్తే.. ఇక హీరోలు సర్దేసుకోవాల్సిందే అంటూ కామెంట్ చేసింది. అయితే వీటిపై కొందరు చాలా సీరియస్ గా స్పందిస్తూ.. నీకు కావాలంటే రక్షణ కూడా కల్పిస్తాం.. చట్టబద్దంగా మరియు ఇతరత్రాపరంగా కూడా నీకు ఏమీ కాకుండా చూసుకుంటాం.. దయచేసి నాలుగు పేర్లను బయటపెట్టు అంటూ వెంటబడుతున్నారట. వారందరూ కూడా సంఘంలోని పరపతి ఉన్న వ్యక్తులే. వీటన్నింటినీ నాలుగు రోజుల నుండి విని తట్టుకోలేని రిచా చివరకు ఏమందో తెలుసా?

అబ్బే నాకు అలాంటిదేం జరగేలదు. నేనేదో జనరల్ గా చెప్పాను అంతే.. అంటూ బుకాయించింది. ట్విట్టర్లో ప్రతీ చిన్న విషయంపైనా అవాకులూ చివాకులూ పేల్చుతూ.. అలాగే చెప్పకుండా ఫ్లయిట్ క్యాన్సిల్ చేశారంటూ వివిధ ఎయిర్ లైన్స్ వారిని బూతులు తిట్టేసే రిచా.. ఈ విషయంలో మాత్రం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. భయపడి అలా చేసిందే అంటూ స్ర్తీవాదులూ బాలీవుడ్ విమర్శకులు అంటుంటే.. కాదు అసలు మ్యాటర్ లేకుండానే కావాలనే పేరు హడావుడి చేసి ఇప్పుడు మాట దాటేసింది అంటున్నారు ఇన్సైడర్లు. అది సంగతి.




Tags:    

Similar News