ఆ రోజుల్లో.. జ్ఞాపకాల్లోకి వెళ్ళిన ఆర్జీవీ
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత నాలుగైదు రోజులుగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేసే హడావుడిలో ఉన్నాడు. దీంతో విజయవాడకు వెళ్ళిన ఆయన పైపుల రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి 'జై ఎన్టీఆర్' అంటూ నినాదాలు చేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఆర్జీవీ రీసెంట్ గా సిద్ధార్థ కాలేజి హాస్టల్ ను సందర్శించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
ఆర్జీవీ కాలేజిలో చదువుకునే రోజుల్లో సిద్ధార్థ కాలేజి హాస్టల్ లో ఉండేవాడు. ఆ హాస్టల్ రూమ్ కు వెళ్ళి అక్కడ ప్రస్తుతం ఉంటున్న విద్యార్థినులతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసిన అర్జీవీ "ఇదే రూమ్ లో నేను సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజిలో చదివే సమయంలో రెండేళ్లకు పైగా ఉన్నాను. ఇప్పుడు అది అమ్మాయిల హాస్టల్ గా మారింది. ఈ అమ్మాయిలే ప్రస్తుతం రూమ్ లో ఉంటున్నారు. నేను ఈ గదిలో ఉన్న సమయంలో సరిగ్గా నా వెనక శ్రీదేవి పోస్టర్ ఉండేది." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మొత్తానికి గురుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాడు.
అప్పట్లో సిద్ధార్థ కాలేజి విద్యార్ధిగా ఉన్న ఆర్జీవీ తర్వాత కాలంలోఒక సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎక్కువమంది ఆర్జీవీని వివాదాస్పద దర్శకుడిగా చూస్తున్నారు. ఈ ఫోటోకు నెటిజనులు ఇంట్రస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు "మీకు కూడా ఎమోషన్స్ ఉన్నాయా సార్' అన్నారు. ఇంకొకరు 'నువ్వు కేక సామి' అన్నారు.