ఎట్టకేలకు 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్..
భారతీయ సినీ చరిత్రలో `బాహుబలి 2` నెలకొల్పిన రికార్డులు దాదాపు అజేయమని అందరూ భావించారు.;
భారతీయ సినీ చరిత్రలో `బాహుబలి 2` నెలకొల్పిన రికార్డులు దాదాపు అజేయమని అందరూ భావించారు. ముఖ్యంగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధించిన 20.777 మిలియన్ డాలర్ల వసూళ్ల రికార్డ్ గత తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అయితే తాజాగా `ధురంధర్ 2` ఆ రికార్డును అధికారికంగా బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ చిత్రం ఏకంగా 21 మిలియన్ డాలర్ల మార్కును దాటి నార్త్ అమెరికాలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా అగ్రస్థానానికి చేరుకుంది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం విదేశీ మార్కెట్‌లో పెను తుఫానును సృష్టించింది. కేవలం బాహుబలిని మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో భారీ వసూళ్లు సాధించిన కల్కి 2898 AD-18.5 మిలియన్ డాలర్లు, పఠాన్ -17.5 మిలియన్ డాలర్లు. జవాన్ 15.6 మిలియన్ డాల్లు, RRR-15.3 మిలియన్ డాలర్లు, పుష్ప 2 -15.3 మిలియన్ డాలర్లతో వసూళ్లలో దిగ్గజ చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. ఈ విజయం భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
`ధురంధర్ 2` విజయంలో కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు.. ప్రేక్షకుల రాక కూడా కీలక పాత్ర పోషించింది. నార్త్ అమెరికాలో ఒక భారతీయ సినిమాకు ఈ స్థాయిలో జనాలు రావడం ఇదే తొలిసారి. పాజిటివ్ టాక్, అద్భుతమైన కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. చాలా చోట్ల హౌస్‌ఫుల్ షోలు నడుస్తుండటమే కాకుండా సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తున్న రిపీట్ ఆడియన్స్ ఉండటం విశేషం.
ఈ చిత్ర ప్రభంజనం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ఆస్ట్రేలియాలో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ప్రస్తుతం విదేశాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-15 భారతీయ చిత్రాల జాబితాలో `ధురంధర్ 2` 13వ స్థానంలో కొనసాగుతోంది. కేవలం హిందీ మార్కెట్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు స్థిరమైన వసూళ్లు దక్కుతున్నాయి.
విడుదలైన నాలుగు వారాల తర్వాత కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. కొత్త రికార్డులను నెలకొల్పుతూ భవిష్యత్ చిత్రాలకు సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. బాహుబలి వంటి దృశ్య కావ్యం నెలకొల్పిన మైలురాయిని అధిగమించడం.. అదే సమయంలో అంతర్జాతీయ వసూళ్లలోను అదరగొట్టడం చూస్తుంటే... భారతీయ సినిమా హాలీవుడ్ కి ధీటుగా ఎదుగుతోందనే సంకేతాలు అందుతున్నాయి.