24 గంటల్లో ప్లేట్ ఫిరాయించిన ఆర్జీవీ...!

Update: 2020-07-24 06:15 GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ''పవర్ స్టార్'' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'పవర్ స్టార్' ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ ఈ చిత్రాన్ని జూలై 25న ఉదయం 11 గంటలకు 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్'లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ దగ్గర నుండి నటీనటుల సెలక్షన్ వరకు ఏది చూసినా పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీస్తున్న సినిమానే అనే భావన కలుగుతుంది. ఇక ట్రైలర్ చూస్తే ఎన్నికల ఫలితాల అనంతరం స్టోరీ అంటూ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత అంశాలను కల్పించి సినిమాగా మలిచారని అర్థం అవుతోంది. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న కొందరు అభిమానులు వర్మ కంపెనీపై దాడికి పాలపడ్డారు. దీనిని కూడా ఆర్జీవీ తన పబ్లిసిటీకి ఉపయోగించుకుంటూ ట్రైలర్ కి మరో మిలియన్ వ్యూస్ యాడ్ అయ్యేలా చేసుకున్నారు.

ఇదిలా ఉండగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న 'పవర్ స్టార్' మూవీ స్టోరీ 24 గంటల్లో మారిపోయే పరిస్థితి ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు అందరూ అనుకున్నట్లు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా కాకుండా ఆయనకి ఫేవర్ గా స్టోరీ చేంజ్ చేస్తున్నారని భోగట్టా. రామ్ గోపాల్ వర్మ మాట మీద నిలబడడని.. చెప్పేది ఒకటి తీసేది ఒకటని మనం గతంలో చాలా సినిమాల విషయంలో చూసాం. ఇప్పుడు 'పవర్ స్టార్' విషయంలో కూడా ఇప్పటి వరకు అందరూ పవన్ కళ్యాణ్ పై వ్యగ్యంగా ఈ సినిమా ఉండబోతోందని అనుకునేలా స్ట్రాటజీ ప్లే చేసిన వర్మ పీకే అభిమానులను రెచ్చగొట్టకుండా.. పవన్ కళ్యాణ్ పై సానుభూతి కలిగించేలా స్టోరీ లైట్ గా చేంజ్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా ప్లాన్ తోనే 'పవర్ స్టార్' విషయంలో వర్మ ముందే రెండు వర్షన్స్ స్టోరీ రెడీగా పెట్టుకున్నాడని సమాచారం. నిన్న వర్మ ఆఫీస్ పై దాడి జరిగిన అనంతరం ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన వర్మ.. 'పవర్ స్టార్' సినిమా చూసిన తర్వాత ఆయన అభిమానులు నన్ను మెచ్చుకుంటారని.. నేను అందరికంటే పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని అని.. సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. మరి ''పవర్ స్టార్'' సినిమా పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా ఉంటుందా లేదా సెటైరికల్ గా ఉంటుందా అనే విషయం తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News