డాషింగ్ డైరెక్టర్ పై రేణుదేశాయ్ ప్రశంసల జల్లు

Update: 2020-04-21 14:00 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా ఒక్కటైన జంటలలో పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ జంట ప్రత్యేకమైనది. నిజ జీవితంలో ఒక్కటై కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం విడివిడిగా ఉంటున్న ఈ జంటకు జనాల్లో ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ కనిపించగానే రేణు - రేణు కనిపించగానే పవన్ గుర్తొస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్ విడిపోవడం ఫ్యాన్స్‌ని కలచివేసింది. అయినప్పటికీ ఆ చేదు నిజాన్ని గుండెలో దాచుకున్న అభిమానులను 20సంవత్సరాలు పూర్తిచేసుకున్న బద్రి సినిమా జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది రేణుదేశాయ్.

అంతేగాక బద్రి సినిమానే తన జీవితంలో మార్పు తీసుకొచ్చినట్లు చెప్పింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్, - రేణుదేశాయ్ - అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా 'బద్రి' సినిమా రిలీజై సంచలనాలు సృష్టించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి ఈ 20 సంవత్సరాల్లో స్టార్ హీరోలతో వర్క్ చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తో కాసేపు వీడియో చాట్ చేసిన రేణుదేశాయ్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన లైఫ్ ఇలా ఉండటానికి కారణం మీరే అని పూరితో చెప్పింది. పూరి జగన్నాథ్ ఓ బ్రిలియంట్ రైటర్ అంటూ ఆయన్ను తెగ పొగిడింది రేణు దేశాయ్.

''ఎలాంటి ఆడిషన్స్ తీసుకోకుండా నన్ను నమ్మి వెన్నెల రూపంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా తొలి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నా. కాకపోతే ఆ సినిమాలో అదే మెయిన్ రోల్ అని చెప్పారు. అయితే మీరు బద్రి సినిమాలో ఆ రోల్ రాశారు - నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే కళ్యాణ్ గారిని కలిశాను. ప్రపంచంలోనే ఎంతో విలువైన ఇద్దరు పిల్లలకు తల్లయ్యాను. ఇదంతా మీరు సృష్టించిన ఆ క్యారెక్టర్ వల్లే జరిగింది. అందుకే నా జీవితంలో మీరు చాలా చాలా స్పెషల్ పర్సన్ - మీకెంతో రుణపడి ఉన్నానని'' తెలిపింది రేణుదేశాయ్.
Tags:    

Similar News