మాజీ భార్యకి పవన్ హెల్ప్ చేశాడా??

Update: 2016-02-05 01:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇప్పుడు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా మారి ఓ సినిమా తీసింది రేణు. ఇష్క్ వాలా లవ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఓ మరాఠీ మూవీ. ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. దీంతో తర్వాత డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేద్దామని రేణూ దేశాయ్ భావించింది.

కానీ ఒరిజినల్ మూవీ ఫ్లాప్ అవడంతో అదికూడా జరదలేదు. నిజానికి మరాఠీ వెర్షన్ రిలీజ్ కాకముందు.. తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి కారణం.. పవన్ కుమారుడు అకీరా నందన్ ఈ మూవీతో తెరంగేట్రం చేయడమే. అయితే నెగిటివ్ రివ్యూస్ రావడంతో.. తెలుగు వెర్షన్ ని థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఓ ట్వీట్ చేసింది పవన్ ఎక్స్ వైఫ్. 'అందరికీ హెలో, నాకు ఆరోగ్యం బాగోని కారణంగా ఇష్క్ వాలా లవ్ను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతున్నాను. కానీ ఈటీవీలో శాటిలైట్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నాం. త్వరలో టైం, డేట్ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేసింది రేణు.

ప్రస్తుతం ఇష్క్ వాలా లవ్ శాటిలైట్ హక్కులు ఈటీవీ దగ్గర ఉన్నాయి. ఫ్లాప్ సినిమా అయినా సరే.. ఈ డీల్ కుదర్చడంలో పవన్ హ్యాండ్ ఉందని అంటున్నారు. ఈటీవీ గ్రూప్ అధినేత రామోజీరావుకు, పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. ఇలా తన మాజీ భార్య మూవీని తగినంత రేటుకే శాటిలైట్ ప్రీమియర్ గా ప్రదర్శించేలా డీల్ కుదిర్చాడట పవన్ కళ్యాణ్. 
Tags:    

Similar News