పవన్ పై కోపం లేదు
పవన్ కళ్యాణ్ నుండి విడి పోయిన తర్వాత కూడా అడపా దడపా ఆయన గురించి స్పందిస్తూ మీడియాలో ప్లేస్ పొందుతున్న రేణు దేశాయ్ మరోసారి పవన్ గురించి స్పందించింది. చాలా కాలంగా రేణు దేశాయ్ కవితలు రాస్తూ వస్తుంది. ఆ కవితల్లోంచి 36 కవితల్ని ఎంపిక చేసిన రేణుదేశాయ్ వాటిని ప్రచురించింది. ఆ పుస్తక ఆవిష్కరణ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన రేణు దేశాయ్ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా స్పందించింది.
నేను ఆయన నుండి విడిపోయిన సమయంలో కోపం రాలేదు, ఆయనపై నేను ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు. ఆయన నుండి విడిపోయినప్పుడు మాత్రం బాధ వేసింది. చిన్న విషయాలకు కోపాలు వస్తుంటాయి. అయితే అవి తాత్కాలికంగా ఉండి పోతాయి. కాని ఎవరిపై కూడా కోపం అలాగే ఉండదు. ఆ వ్యక్తిపై కోపం ఉండదు, ఎందుకంటే అదంతా కూడా విధిరాత అని నేను భావిస్తాను. నాకు ఎలాంటి కోపం లేదని క్లారిటీగా చెప్పుకొచ్చింది.
నేను ఏ పోస్ట్ చేసినా, ఏ కవిత రాసినా కూడా ఆయన గురించి రాసినట్లుగా కొందరు ఊహించుకుంటున్నారు. నేను ఏదైనా ఫీల్ తో, బాధతో కవిత రాస్తే నాకు పవన్ పై ఉన్న కోపంతో ఆ కవిత రాశాను అంటున్నారు. ఏదైనా ప్రేమగా రాస్తే అది పవన్ ను ఊహించుకుని రాసినట్లుగా భావిస్తున్నారు అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వచ్చే ఏడాదిలో రైతుల సమస్యల గురించి సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన రేణు, ఇదే సమయంలో వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. నా మనసుకు నచ్చిన రంగంలో అడుగు పెడుతూ, పూర్తి స్వేచ్చగా జీవితాన్ని సాగిస్తానంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.