రేణుదేశాయ్ కు తోడు దొరికిందా..?

Update: 2018-06-16 12:12 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో  చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ చూశాక ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అర్థమవుతోంది.  శనివారం రేణుదేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్టు చేసింది. ఓ వ్యక్తి చేయి పట్టుకొని దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆ వ్యక్తి గురించి వివరిస్తూ ఓ కవితను కూడా రేణుదేశాయ్ పోస్టు చేయడంతో సంచలనమైంది.

అయితే రేణుదేశాయ్ చేయిపట్టుకున్న వ్యక్తి ఎవరనేది ఆమె బయటపెట్టలేదు. కేవలం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కవితరూపంలో వెల్లడించి ఆశ్చర్యపరిచింది.. రేణు దేశాయ్ రాసుకొస్తూ ‘ప్రేమ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. కవితలోనే అది దొరుకుతుందని భావించాను. కొన్ని సార్లు క్యాండిలైట్ డిన్నర్లు - మరికొన్నిసార్లు తీపి అబద్దాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి’ అంటూ రేణు కవితాత్మకంగా చెప్పింది.

దాంతోపాటు ‘నీ నిజాయితీ - నీ మాటల్లో నాకు ప్రేమ దొరికింది. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వదిలి వెళ్లకు. నాలో నువ్వు ఆ నమ్మకాన్ని కల్పించావు’ అంటూ కవితను ముగించారు. దీంతో రేణు కు వ్యక్తి తోడు దొరికిందని.. అతడి గురించే ఆమె కవితలో చెప్పారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. కానీ ఈ కామెంట్స్ పై రేణు స్పందించడం లేదు.
Tags:    

Similar News