ఫ్రీడమ్ రాకముందు రెజీనా ఏం చేసిందో

Update: 2016-08-08 04:35 GMT
రెజీన కసాండ్రా ఇప్పుడు చిన్న హీరోల పాటి పెద్ద హీరోయిన్ అయిపోయింది. అందరూ రెజీనా వంకే చూస్తున్నారు. అనామక హీరోయిన్స్ నో కొత్త హీరోయిన్స్ నో తీసుకుని ప్రయోగాలు చేసే బదులు.. రెజీనాతో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈమె తక్కువగా ఛార్జ్ చేయడం.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచడం ఇందుకు కారణాలుగా చెప్పచ్చు.

ఇప్పుడు దగ్గుబాటి రానాతో కలిసి ఓ పీరియాడికల్ సినిమా చేయనుంది రెజీనా. ఈ సినిమా సత్యశివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. 1940ల నాటి స్టోరీ ఇది. ఇంతకీ రానాతో రెజీనా చేస్తున్న ఈ సినిమా పేరేంటో తెలుసా.. ''1945''. అంటే స్వాతంత్ర్యం రాక ముందు సినిమా అన్నమాట. ఫ్రీడం రాకముందు రెజీనా అండ్ రానా ఏం చేస్తారో మనం చూస్తాం అన్నమాట. నిజానికి ఇలాంటి పీరియడ్ సినిమాలు తెలుగులో రావడమే అరుదు. పైగా ఇప్పుడు కండలవీరుడుగా పాపులర్ అయిన బల్లాలదేవ.. అలాగే డస్కీ బ్యూటి రెజీనా కాంబినేషన్ లో వస్తోందంటే.. ఖచ్చితంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇక రెజీనా విషయానికొస్తే.. ప్రస్తుతం కుర్ర హీరోలతో అమ్మడు దాదాపు ఐదు సినిమాలు సైన్ చేసేసింది. నాగశౌర్య- నారారోహిత్ లతో కలిసి.. జ్యో అచ్యుతానంద చేస్తోందీ భామ. ఈ సినిమా దర్శకుడు ప్రధాన పాత్రలో నటించనున్న సెక్స్ కామెడీ హంటర్ లోనూ రెజీనానే హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ కి జోడీగా నటిస్తోంది. అజయ్ అనే డైరెక్టర్ తో మంచు మనోజ్ చేస్తున్న సినిమాలో కూడా రెజీనానే నటించనుంది. రానా సినిమాతో కలిపి.. ఐదు ప్రాజెక్టు ఆన్ ది సెట్స్ మరి!!
Tags:    

Similar News