మూడు మూడు లాగించేస్తున్న రెజీనా

Update: 2017-02-25 07:03 GMT
హ్యాట్రిక్ కాంబినేషన్ అనే పాయింటే చాలా క్రేజీగా ఉంటుంది. వరుసగా రెండు సార్లు రికార్డుల అంతు చూడ్డంతోనే అసలీ కాంబినేషన్ సాధ్యమవుతుంది. ఇప్పుడు సౌత్ బ్యూటీ రెజీనా కసాండ్రా.. ఒకే మూవీతో మూడు రికార్డుల హ్యాట్రిక్ అంతు చూసేందుకు సిద్ధపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం మూవీలో సందీప్ కిషన్ తో జోడీ కట్టింది రెజీనా. ఇప్పటికే రొటీన్ లవ్ స్టోరీ.. రారా కృష్ణయ్యా చిత్రాలలో సందడి చేసిన ఈ సుందరాంగికి.. సందీప్ తో కలిసి అల్లరి చేయడం ఇది మూడో సారి. మరోవైపు.. ఇదే సినిమాలో సుప్రీం హీరో సాయిధరం తేజ్ కూడా నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలలో తేజుతో ఆడిపాడిన రెజీనాకి.. నక్షత్రం హ్యాట్రిక్ మూవీగానే చెప్పాలి.

నారా రోహిత్ తో శంకర.. జ్యో అచ్యుతానంద చిత్రాలలో కలిసి కనిపించిన రెజీనా.. ఇప్పుడు పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో మూడోసారి జత కట్టనుంది. ఒక హీరోతో రెండో సారి చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. వరుసగా హ్యాట్రిక్స్ కొట్టేయడంలో రెజీనా ఆరితేరిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News