ఆ ఫోటోషూట్.. రెజీనాకు మండింది

Update: 2016-11-28 03:38 GMT

టాలీవుడ్ బ్యూటీస్ లో రెజీనాకి స్పెషల్ గుర్తింపు ఉంది. ఈ తరం హీరోయిన్లలో అందంతో కాకుండా.. యాక్టింగ్ ట్యాలెంట్ గుర్తింపు సంపాదించిన భామ రెజీనా కసాండ్రా. కాకపోతే మొదట్లో కాస్త మడి కట్టుకుకూర్చోవడంతో ఆఫర్స్ అంతగా రాలేదు. ఈమె నటించిన స్టార్ హీరో మూవీ రవితేజ పవర్ ఒక్కటే. అది సక్సెస్ అయినా అమ్మడికి ఉపయోగమేమీ లేకపోయింది. జ్యో అచ్యుతానందతో హిట్ కొట్టినా అదీ ఈమె కెరీర్ కి ఉపయోగపడలేదు.

అలాంటి టైమ్ లో ఫోటో షూట్స్ ను ఆశ్రయించడం కామన్. రెజీనా కూడా ఈ హాట్ హాట్ ఫోటో షూట్ చేసేసింది. తనలో ఉన్న అందాలను వేడివేడిగా కెమేరా ముందు వడ్డించేసింది. సింపుల్ వైట్ కాస్ట్యూమ్స్ లో.. తన దేహశిరి అంతా బాగా కనిపించేలా.. బ్లాక్ అండ్ వైట్ లో.. అందాలను ఆరబోసింది. ఇన్నర్ వేర్ కనిపించేలా.. క్లీవేజ్ సొగసులు మెరిసేలా రెజీనా రెచ్చిపోయింది. కాని.. ఈ ఫోటోలు కత్తిలా ఉన్నా.. అమ్మడి అందాలు అంతకంటే మెరిసినా..  ఫోటో షూట్ మాత్రం ఏ మాత్రం ఉపయోగపడలేదు.

అందుకే ఈ భామకు తెగ మండిపోయి.. 'వారానికో కొత్త అమ్మాయి పరిచయం అవుతూ ఉంటుంది. అందుకే హీరోయిన్స్ ను తెలుగు ఆడియన్స్ తొందరగా మర్చిపోతారు. అదే తమిళ్ లో అయితే ట్యాలెంట్ ను గుర్తు పెట్టుకుంటారు' అంటూ దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చింది రెజీనా. ఇప్పటికైతే తెలుగులో ఈమె చేతిలో ఉన్న మూవీ కృష్ణవంశీ నక్షత్రం ఒక్కటే. కోలీవుడ్ లో అయితే ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయ్ కానీ.. తెలుగులో కెరీర్ కంటిన్యూ కావడం మాత్రం నక్షత్రం సక్సెస్ పై ఆధారపడి ఉంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News