ఆకతాయి రోడ్డు పై ముద్దు పెట్టి బలవంతం చేయబోయాడు

Update: 2020-06-25 18:22 GMT
రెజినా కెసెండ్రా. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైలో పుట్టి పెరిగి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటగా తమిళంలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తెలుగులో ఎస్ఎంఎస్ సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించి  తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి ఫామ్ ని కంటిన్యూ చేసింది. మొదటి నుండి గ్లామర్ షోకి వెనుకాడని రెజినా నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. ఇక తాజాగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు పంచుకుంది. అయితే చెన్నైలో ఉన్నప్పుడు తన కాలేజీ టైంలో.. ఈగ థియేటర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న సినిమా థియేటర్ సమీపంలో కొందరు ఆకతాయిలు తనపై అసభ్యంగా మాట్లాడారని.. ఆ గుంపులో నుండి ఒకడు నన్ను తాకరాని చోట తాకేందుకు ప్రయత్నించి.. తన పెదాల పై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.

అయితే ఆ ఆకతాయిని ముందే పసిగట్టి గట్టిగా ప్రతిఘటించిందట. అలాగే రెజినా స్కూల్ టైంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఎదుర్కొందట. అయితే స్కూల్ టైంలో తను చాలా బలహీనంగా ఉండేదని చెప్పింది. ఆ టైంలో అసలు ఎదుటి వ్యక్తిని ఎదురించే బలం కూడా లేదంటోంది అమ్మడు. ఇక అలాంటి సంఘటనలు చాలా ఎదురైన తర్వాత రెజినా శారీరీకంగా ధృడంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. అప్పటినుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎక్కడికైనా వెళ్తే ఒంటరిగా వెళ్లకుండా స్నేహితులతో కలిసి వెళ్లేదాన్ని అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. అయితే అప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీతో పాటు అమ్మాయిల పై వేధింపులు కూడా పెరిగాయని అంటోంది. ఇక తను కాలేజీ రోజుల్లోనే శారీరకంగా స్ట్రాంగ్ అవ్వడానికి వ్యాయామాలు.. కసరత్తులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం అమ్మడు మెగాస్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది.
Tags:    

Similar News