బాగానే సపోర్టు చేస్తున్నావ్ రెజీనా

Update: 2016-07-30 04:08 GMT
మామూలుగా చాలామంది సెలబ్రిటీలు.. ఎవరన్నా ఇతర హీరోలు కాని హీరోయిన్లు కాని ఆడియో ఫంక్షన్లకు పిలిస్తే.. ఒకప్పుడు మాత్రం ఈగో ఫీలింగులను అడ్డుగా పెట్టుకొని మనోళ్ళు వచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఒకరి సినిమాలను ఒకరు బాగానే ప్రమోట్ చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్లలో అయితే.. డస్కీ బ్యూటి రెజీనా కసాండ్రా ఏ సినిమా వాళ్ళు పిలిచినా కూడా వచ్చి ఎంకరేజ్ చేస్తోంది.

ఆ మధ్యన రాజా చెయ్యి వేస్తే సినిమా ప్రమోషన్ కోసం తారకత్నను ఇంటర్యూ చేసింది రెజీనా. ఆ  సినిమాకీ అమ్మడుకూ ఏం సంబంధం లేదు. ఇకపోతే చాలా ఆడియో ఫంక్షన్లలో చాలామంది హీరోల కోసం గెస్టుగా విచ్చేసింది. ఈ కార్యక్రమాలన్నింటికీ డబ్బులు ఏమీ ముట్టజెప్పరు. ఇవన్నీ కేవలం ఫ్రెండ్లీ రిలేషన్లో కొట్టుకుపోయే పర్సనల్ మిషన్స్ అనమాట. గత రాత్రి అమ్మడు 'బంతిపూల జానకి' అనే సినిమా ఆడియో లాంచ్ కు వచ్చింది. కేవలం కమెడియన్ ధనరాజ్ కోసం అక్కడకు వచ్చిందని.. ఆమె మనోడికి ఇచ్చిన హగ్ చూస్తే అర్ధమవుతోంది.

హీరోలనే కాదు.. కమెడియన్లు ప్రొడ్యూస్ చేసే సినిమాలను కూడా ప్రమోట్ చేస్తోందంటే మామూలు విషయం కాదు. బాగానే సపోర్టు చేస్తున్నావ్ రెజీనా. అయితే ఈ మంచితనం అంతా కలిసొచ్చి అమ్మడి కెరియర్లో పెద్ద పెద్ద సినిమాలూ భారీ బా్లక్ బస్టర్లూ పడాలని ఆశిద్దాం.
Tags:    

Similar News